Hyderabadi Mutton Paya: ప్రస్తుతం నగరంలో మటన్ పాయా షేర్వా భారీ డిమాండ్ ఉంది. ఈ శీతాకాలంలో చలి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మటన్ పాయా షేర్వాకు తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాదీ మటన్ పాయా అనేది మేక కాళ్లతో తయారు చేసే సంప్రదాయ భారతీయ వంటకం. ఇది రిచ్, రుచికరమైన కూర. సువాసన వచ్చే మసాలాలు, ఉల్లిపాయలు, టమాటాలు, పెరుగు కలిపి దీన్ని సిద్ధం చేస్తారు. మేక కాళ్లు బాగా మెత్తబడటం వల్ల వచ్చే జెలటిన్‌లాంటి టెక్స్చర్ ఈ వంటకానికి ప్రత్యేకత. సాధారణంగా నాన్ లేదా అన్నంతో దీనిని ఆస్వాదిస్తారు. దీన్ని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Lokayukta court: మాజీ ఎమ్మెల్యే భూ ఆక్రమణ..! లోకాయుక్త కోర్టు సీరియస్
ఈ మటన్ పాయా తయారికి కావలసిన పదార్థాలు:
మేక కాళ్లు – 500 గ్రాములు
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
టమాటాలు – 2 (పేస్ట్ చేసినవి)
అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
పసుపు – 1 టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
జీలకర్ర పొడి – 1 టీ స్పూన్
పెరుగు – అర కప్పు
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర – అవసరమైనంత
READ MORE: The Raja Saab: ప్రభాస్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ముగ్గురు భామల మధ్య డార్లింగ్‌ను ఆడేసుకోనున్న వంగా!
ముందుగా మేక కాళ్లను బాగా శుభ్రంగా కడిగి ఉంచాలి. ప్రెజర్ కుక్కర్‌లో మేక కాళ్లు, తరిగిన ఉల్లిపాయలు, టమాటా పేస్ట్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. తగినంత నీరు పోసి మూత పెట్టి సుమారు 30 నిమిషాలు ప్రెజర్ కుక్ చేయాలి. మేక కాళ్లు పూర్తిగా మెత్తగా ఉడికే వరకు ఉంచాలి. వేరే పాన్‌లో నూనె వేడి చేసి కొద్దిగా ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించిన మేక కాళ్లు వాటి స్టాక్‌తో కలిసి పాన్‌లో వేసి మరో 15 నుంచి 20 నిమిషాలు మరిగించాలి. గ్రేవీ బాగా కలిసేలా ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేయాలి. ఇంకా మంచి రుచికి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు. గ్రేవీ మరింత చిక్కగా కావాలంటే ఒక టేబుల్ స్పూన్ కాల్చిన శెనగపిండి కలపవచ్చు. ప్రెజర్ కుక్కర్ లేకపోతే సాధారణ పాత్రలో 2 నుంచి 3 గంటలు నెమ్మదిగా ఉడికించాలి. మిగిలిన మటన్ పాయాను గాలి చొరబడని డబ్బాలో ఫ్రిజ్‌లో ఉంచితే 3 రోజులు వరకు నిల్వ ఉంటుంది. తినే ముందు గ్యాస్‌పై లేదా మైక్రోవేవ్‌లో వేడి చేసుకోవాలి. నాన్, అన్నం లేదా బ్రెడ్‌తో తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ వింటర్‌లో తప్పక ట్రై చేయండి.