మా సుపరిపాలన-సుస్థిరతే బీజేపీ ద్వేష పూరిత ప్రచారానికి సరైన సమాధానమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రాతినిథ్యం వహించడం నా అదృష్టమని కేటీఆర్ అన్నారు. ట్విట్టర్‌లో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ విమర్శల దాడులకు దిగారు. బీజేపీ విషపూరిత ఎజెండాను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. ఓ నెటిజన్ జాతీయ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి..? మిమ్ముల్ని భారతదేశానికి ఐటీ మంత్రిగా చూడాలనుకుంటున్నాం అంటూ ట్వీట్ చేయగా సొంత రాష్ట్రానికి సేవ చేస్తూ సంతోషంగా ఉందని సమాధానం ఇచ్చారు.
Read Also: తెలంగాణలో కరోనా టెర్రర్… నేడు 2,707 కేసులు
బీజేపీ చేసే అసత్య ప్రచార మూర్ఖత్వం, దాన్ని వదిలి వేయడమే మంచిదని కేటీఆర్ అన్నారు. రెండుసార్లు ప్రజలు అవకాశం ఇచ్చినా, అభివృద్ది చేయలేకపోవడం వల్లనే మతమే ఎజెండాగా బీజేపీ మాట్లాడుతుందని విమర్శించారు. ప్రతి అకౌంట్‌లో రూ. 15 లక్షల రూపాయల హామీ ఈ శతాబ్దపు జుమ్లా అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ గెలిచే అవకాశం ఉందన్నారు. రేవంత్ రెడ్డి లాంటి నేరస్తులు.. 420లతో చర్చకు దిగనని కేటీఆర్ అన్నారు. ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు ప్రభుత్వం లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ పైన నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ చెప్పారు.