Bhatti Vikramarka: డైట్ చార్జీల పెంపు చారిత్రాత్మక మైన రోజు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బొనకల్ మండల కేంద్రంలో గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మానవ వనరులు అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. విద్యార్థుల వల్లనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం లక్ష్యం అందరి క్షేమమని భట్టి విక్రమార్క అన్నారు. యావత్ మంత్రి మండలి మొత్తం కూర్చొని నిర్ణయం చేశామన్నారు. పోషకాలతో కూడిన మెనూ విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయం చేశామన్నారు.
Read also: CM Revanth Reddy: కామన్ డైట్ ప్లాన్.. చిలుకూరులో ప్రారంభించిన సీఎం రేవంత్
దేహదారుఢ్యతో వుంటే అన్ని రంగాల్లో పోటీ పడగలమని పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా వుండాలంటే విద్యా బుద్దులు మాత్రమే కాదు..మానసికంగా దేహ దారుఢ్యం తో ఎదగాలని విద్యార్థులకు డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక బారం అయినప్పటికీ ప్రతి స్కూల్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతినిధులు అందరం విద్యార్థులతో కలసి భోజనం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం మాపై బాధ్యతగా వున్నదని విద్యార్థులు గుర్తించాలన్నారు. ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మీ తల్లి దండ్రులు సంతోష పడాలన్నారు. ప్రభుత్వం సంక్షేమం పై దృష్టి సారించడం చేశామని తెలిపారు. గురు కులాలలో పాఠశాల లు, మెనూ ధరల పట్ల పదేళ్లుగా గత ప్రభుత్వం నిర్ణక్ష్యం చేసిందన్నారు. అధ్యాపకులు పెరిగిన ధరలు వల్ల సరుకులు కొనలేక ఇబ్బంది పడ్డారన్నారు.
Read also: Danam Nagender: అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో
పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుతున్నామన్నారు. 40 శాతం డైట్ ధరలను పెంచామన్నారు. 8 వ తరగతి వారికి 1540 కాగా.. ఇంటర్ పీజీ వారికి 2100 కు పెంచామన్నారు. కాస్ఫమోటిక్ చార్జీలు కూడా భారీగా పెంచామన్నారు. ఈడీవో తరగతి వారికి 175 రూపాయలు,8 నుంచి చదివే వారికి 75 నుంచి 275 కు పెంచామన్నారు. హెయిర్ కటింగ్ మగా పిల్లలకు పెంచామని, రాష్ట్ర ప్రభుత్వం పై భారం పడినప్పటికీ పెంచుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకంగా డైట్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రెసిడెన్సియల్ స్కూల్‌కే కాదు మాములు హాస్టల్‌లకు కూడా పెంచామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. అన్ని గురుకులాలు, హాస్టల్ లకు భవంతుల నిర్మాణం కూడా చేస్తున్నామన్నారు.
Read also: Burra Venkatesham: గ్రూప్ -2 అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు..
ప్రపంచంతో పోటీ పడే యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ 5000 కోట్లతో.. ఈ ఏడాది స్కూల్‌ల నిర్మాణం చేపట్టామన్నారు. గత ప్రభుత్వం హాస్టల్ నిర్మాణాలకు 70 కోట్లు ఖర్చు చేసిందని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రపంచ స్థాయిలో నిర్మాణాలు చేపట్టామన్నారు. అధికారం లోకి వచ్చే నాటికి రాష్ట్రంలో కొన్ని నెలలుగా పెండింగ్ లో వున్నాయన్నారు. పెండింగ్ బిల్లులు అన్నీ మంజూరు చేశామన్నారు. పిల్లల ఆహారంలో ఎక్కడ కల్తీ వుండదన్నారు. ఎక్కడా నాణ్యత లోపించిన కఠినంగా వుంటామన్నారు. పొరపాటున తేడా వహించిన సహించేది లేదని ఉపేక్షించమని హెచ్చరించారు. మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపిస్తామన్నారు.
Read also: Leopard Attack: ఆదిలాబాద్ జిల్లాలో మహిళపై చిరుత దాడి.. భయాందోళనలో ప్రజలు
ఆనాడు పాఠశాలలు మెనూ చార్జీలను పట్టించుకోని వారు నేడు పాఠశాలలు సందర్శించి భోజనం బాగా లేదని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి కనీసం సిగ్గు లేదన్నారు. ఈ పదేళ్లు ఈ పాఠశాలలు, హాస్టల్ లు ఈ విధంగా కావడానికి మీరు కాదా? అని ప్రశ్నించారు. మీ లాగ డ్రామాలు చేయడం లేదని, బాధ్యతగా అంకిత భావంతో పని చేస్తున్నామన్నారు. రాష్ట్ర కోసం భవిష్యత్ కోసం ఖర్చు పెడుతున్నమన్నారు. 11000 మంది టీచర్ రిక్రూట్మెంట్ పదేళ్ల తరువాత చేశామని తెలిపారు. మరో ఆరు వేల మంది టీచర్ రెక్రూట్‌మెంట్ చేస్తామన్నారు. పదేళ్ల నుంచి రాష్టము లో రెక్రూట్‌మెంట్ లేదని గుర్తుచేశారు. ఇంకా జాబ్ క్యాలెండర్ పెడుతున్నామన్నారు. అందరికీ ఉద్యోగాలు రావాలి, లేదా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అయిన వుండాలన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగం దొరక్కపోతే అది సమాజానికి మంచిది కాదని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మార్పులు చేస్తున్నామని, నిధులు లేకపోయినా నిధులు సమకూర్చుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Mohan Babu: అండర్ గ్రౌండ్ కి మోహన్ బాబు.. ఐదు బృందాలతో సెర్చ్ ఆపరేషన్