CM Revanth Reddy: హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ను చిలుకూరులో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరుకు చేరుకున్నారు. టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. వారం రోజుల్లో 5 రోజులు కోడిగుడ్డు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు అంటే మల్టీ టాలెంటెడ్ అని సీఎం అన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ అని తెలిపారు.
Read also: Ponnam Prabhakar: గ్రీన్ ఛానెల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తాం.. డైట్ మెనూను ప్రారంభించిన మంత్రి
గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో విద్యా ప్రమాణాలను పెంచుతామన్నారు. 26వేల ప్రభుత్వ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని సీఎం తెలిపారు. 26వేల ప్రభుత్వ స్కూళ్లల్లో 11లక్షల మంది చదువుతుంటే.. తక్కువున్న ప్రైవేట్ స్కూళ్లల్లో 33 లక్షల మంది చదువుతున్నారని సీఎం అన్నారు. తక్కువగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లల్లో ఎక్కువమంది చదువుతున్నారని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో టీచర్లు ఆలోచించాలని సీఎం రేవంత్ తెలిపారు. చదువుపై పెట్టే పెట్టుబడి.. భవిష్యత్ పై పెట్టేదే అని రేవంత్ అన్నారు. గురుకులాలు, హాస్టల్స్ లో విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం తెలిపారు.
Danam Nagender: అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో