వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి తెలుగు క్లబ్ లో సినీ రంగ ప్రముఖులు, శ్రీరంగ కార్మిక నాయకుల సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో నేడు ప్రత్యేక రాష్ట్రంలో…
Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా మళ్లీ ఇక్కడకు ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం….బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసం… మా రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తై., నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే మిగులు జలాల అంశం తేల్చుకోవాలి. వరద జలాలపై ఇరు రాష్ర్టాల వాటా తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయ బద్ధంగా ఉంటుంది. నీటి వాటాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిది… రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం… ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్,…
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్‌లో…
హైదరాబాద్ నగరంలోని ఘాట్‌కేసర్ ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ పనులు గత కొన్ని నెలలుగా ఆగిపోయిన నేపథ్యంలో ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని వివరించారు. రోజూ ట్రాఫిక్ జాంలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల పనులను వేగంగా పూర్తిచేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…
నిన్న మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధాలు మాట్లాడేవారని.. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారన్నారు.
Bhatti Vikramarka: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతి యేటా తమిళనాడులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా, ఇకపై ప్రతి సంవత్సరం తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని, ఇందులో ప్రముఖ సంగీత…