Danam Nagender: అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై దానం నాగేందర్ మాట్లాడుతూ.. హీరో అల్లు అర్జున్ మా బంధువని తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బాధాకరం అన్నారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం విచారం వ్యక్తం చేస్తున్నా అని తెలిపారు. బెయిల్ దొరకడం సంతోషకరం అన్నారు. అల్లు అర్జున్ జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ల పేర్లును తీసుకెళ్లి మంచిపేరు తెచ్చారని అన్నారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోనే కాదు పాన్ వరల్డ్ హీరో అన్నారు. అరెస్ట్ కావడం దురదృష్టకరమైన సంఘటనగా నేను భావిస్తున్న అని ఎమ్మెల్యే దానం తెలిపారు. ప్రభుత్వం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదని దానం అన్నారు. కాగా అల్లు అర్జున్ ఈరోజు ఉదయం 6.40 గంటలకు చంచల్ గూడ జైలు నుంచి విడదలైన విషయం తెలిసిందే.
Burra Venkatesham: గ్రూప్ -2 అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు..