తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోగానే పార్టీ శ్రేణులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. కేడర్ తోపులాటతో అసహనానికి గురైన కేసీఆర్ ఒర్లకండిరా బాబు.. దండం పెడతానంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరుగనున్నది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.
Also Read:PVR INOX: సినిమా ముందు యాడ్స్ వేసినందుకు లక్ష ఫైన్
బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్ ను సన్నద్ధం చేసేలా కార్యాచరణపై చర్చించనున్నారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో చేసిన పోరాటాలపై సమీక్ష, భవిష్యత్ వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. ఏప్రిల్ లో జరపబోయే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. హైదరాబాద్ లేదా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి జీహెచ్ ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా సత్తాచాటాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది.