Kavitha : అహంకారమే పార్టీని ముంచింది.. లిక్కర్ కేసు కాదు.. కేసీఆర్, కేటీఆర్‌లపై కవిత సంచలనం
- లిక్కర్ కేసుపై కేటీఆర్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్
- ఎన్నికల ఓటమికి అసలు కారణాలేమిటి?
- అహంకార ధోరణే బీఆర్ఎస్ పతనానికి కారణమా?
- సొంత పార్టీపై కవిత భావోద్వేగ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు క్లీన్ షీట్ ఇచ్చిన వేళ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీ నాయకత్వంపై యుద్ధం ప్రకటించారు. లిక్కర్ కేసు కారణంగానే బీఆర్ఎస్ రెండు ఎన్నికల్లో ఓడిపోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ ఓటమికి బాధ్యతను తన మీదకు తోసేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ, అసలు ఓటమికి దారితీసిన పరిస్థితులను బహిరంగంగా విశ్లేషించారు.
లిక్కర్ కేసు వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న వాదనలో అసలు లాజిక్ లేదని కవిత కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఒక్క స్పీచ్‌లో కూడా తన కేసు గురించి ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. విపక్షాలు తనపై దాడి చేస్తున్నా, పార్టీ నాయకత్వం కనీసం స్పందించి జవాబు ఇచ్చే ప్రయత్నం చేయలేదని గుర్తు చేశారు. అంతేకాకుండా, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన చాలా కాలానికి, అంటే మార్చి నెలలో తన అరెస్ట్ జరిగిందని, అలాంటప్పుడు అంతకుముందే వచ్చిన ఎన్నికల ఫలితాలకు ఈ కేసు ఎలా కారణమవుతుందని ఆమె సూటిగా నిలదీశారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!
బీఆర్ఎస్ పతనానికి లిక్కర్ స్కామ్ కారణం కాదని, పార్టీ అగ్రనేతల అహంకారమే అసలు కారణమని కవిత కుండబద్దలు కొట్టారు. ప్రజలు వద్దని మొత్తుకున్నా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే మళ్లీ టికెట్లు ఇచ్చి ప్రజల నెత్తిన రుద్దడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. “నేను ఎవరిని నిలబెట్టినా మీరు ఓటు వేయాలి” అనే నిరంకుశ ధోరణితో వ్యవహరించడం వల్ల ప్రజలు విసిగిపోయారని, ఆ అహంకార ధోరణే పార్టీని ఓడించిందని ఆమె విమర్శించారు. నేతలు ప్రజలకు ఎంతలా దూరమయ్యారంటే.. సామాన్య కార్యకర్తలకు నేతల దర్శనం కంటే దేవుడి దర్శనమే సులభంగా దొరికేంతగా పార్టీ మారిపోయిందని ఎద్దేవా చేశారు.
తనపై కేసు నడుస్తున్న సమయంలోనే మునుగోడు వంటి ఉపఎన్నికల్లో పార్టీ గెలిచిన విషయాన్ని కవిత గుర్తు చేస్తూ, అప్పుడు లేని నష్టం ఇప్పుడే ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేవలం పార్టీ లోటుపాట్లను, వ్యూహాత్మక తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఓటమి భారమంతా తన మీదకు, ఈ కేసు మీదకు నెట్టడం సరికాదని కేటీఆర్‌కు హితవు పలికారు. ఇటువంటి అబద్ధాలు , నీలాపనిందల వల్లే మనసు విరిగిపోయిందని ఆమె భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నుంచే తనకు ఎదురవుతున్న ఈ పరిణామాలపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Cholesterol Control : చెడు కొలెస్ట్రాల్ మాయం.. మీ గుండె పదిలం..! ఈ ఆహారమే మందు..
తాజావార్తలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!