House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
House Construction Cost: సొంత ఇల్లు కట్టుకోవడం ప్రతీ ఒక్కరి డ్రీమ్. అయితే ప్లాట్ చేతికి రాగానే మనసులో మెదిలే మొదటి ప్రశ్న… “అసలు ఇల్లు పూర్తి కావడానికి ఎంత ఖర్చవుతుంది?” చాలామంది ఈ బడ్జెట్ అంచనాలోనే పప్పులో కాలేస్తారు. మొదట్లో అంతా బడ్జెట్లోనే అయిపోతుందని ధీమాగా ఉన్నా, పని ముందుకు సాగుతున్న కొద్దీ జేబుకు కన్నం పడుతూనే ఉంటుంది. కానీ రూపాయి రూపాయి లెక్కించాల్సిన అవసరం లేకుండా, కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ఒక రఫ్ బడ్జెట్ అంచనా వేసుకోవడానికి ఒక సులువైన మార్గం ఉంది. దీనికోసం మీరు పెద్ద పెద్ద లెక్కలు చేయక్కర్లేదు. మీ ఇంటి ‘బిల్ట్-అప్ ఏరియా’ ఎంత, మీ ప్రాంతంలో ప్రసుతం చదరపు అడుగుకి నిర్మాణ ఖర్చు ఎంత ఉందో తెలిస్తే చాలు. జేకే సిమెంట్, ఆల్ట్రాటెక్ వంటి ప్రముఖ సిమెంట్ సంస్థలు తమ ఆన్లైన్ ‘కన్స్ట్రక్షన్ కాస్ట్ కాలిక్యులేటర్ల’లో వాడే లాజిక్ కూడా ఇదే.
ఈ సింపుల్ కాలిక్యులేషన్ చేయడానికి ముందు ‘బిల్ట్-అప్ ఏరియా’ అంటే ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలామంది కేవలం ప్లాట్ విస్తీర్ణాన్ని మాత్రమే చూసి లెక్కలు వేస్తారు, కానీ అది పొరపాటు. మీరు ఎన్ని ఫ్లోర్లు ఎంత విస్తీర్ణంలో కడుతున్నారో దాన్నంతటినీ కలపాలి. ఉదాహరణకు మీ దగ్గర 600 చదరపు అడుగుల ప్లాట్ ఉందనుకుందాం. అందులో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పైన మొదటి అంతస్తు కూడా 600 చదరపు అడుగుల చొప్పున నిర్మిస్తే, మీ ఇంటి మొత్తం బిల్ట్-అప్ ఏరియా 1,200 చదరపు అడుగులు అవుతుంది. ఇక బడ్జెట్‌ను శాసించే రెండో ముఖ్యమైన అంశం.. చదరపు అడుగు నిర్మాణ ధర. ఇది మీరుండే ప్రాంతాన్ని బట్టి మారుతుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి మెట్రో నగరాల్లో ఉండే రేట్లు, చిన్న టౌన్లలో ఉండవు. కూలీల రేట్లు, సిమెంట్-స్టీల్ ధరలు, మెటీరియల్ రవాణా ఖర్చులు, ఇంటీరియర్ ఫినిషింగ్‌ను బట్టి ఈ స్క్వేర్ ఫీట్ రేటు మారుతుంటుంది. అందుకే ఒక ఊరి రేటును దేశమంతటికీ వర్తింపజేయలేం.
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
దీన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా చూద్దాం. మీ ఇంటి మొత్తం బిల్ట్-అప్ ఏరియా 1,200 చదరపు అడుగులు ఉండి, మీ ప్రాంతంలో చదరపు అడుగుకి సగటున 2,500 రూపాయల ఖర్చు అవుతోందనుకుంటే.. 1,200 ను 2,500 తో గుణిస్తే వచ్చే 30,00,000 రూపాయలు మీ ఇంటి అంచనా ఖర్చు అవుతుంది. అదే చదరపు అడుగు రేటు 3,000 రూపాయలకు పెరిగితే, మొత్తం ఖర్చు 36 లక్షలకు చేరుతుంది. అంటే చదరపు అడుగుకి కేవలం 500 రూపాయలు పెరిగినా, మీ బడ్జెట్లో ఏకంగా 6 లక్షల వ్యత్యాసం వస్తుంది. ఒకవేళ మీరు ఇల్లంతా కాకుండా కేవలం 200 చదరపు అడుగుల్లో ఒక చిన్న గది మాత్రమే కట్టాలనుకుంటే, చదరపు అడుగుకి 2,000 రూపాయల చొప్పున లెక్క వేస్తే 4 లక్షల ఖర్చు రావచ్చు. అయితే ఇలాంటి చిన్న నిర్మాణాలకు ప్రతి చదరపు అడుగు వ్యయం కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పునాది తవ్వడం, కరెంట్, ప్లంబింగ్ వంటి ప్రాథమిక ఖర్చులు గది చిన్నదైనా మారవు. కాబట్టి చిన్న పనులకు పెద్ద ఇళ్ల సగటు రేటును నేరుగా వర్తింపజేయలేం.
అయితే ఈ ‘బిల్ట్-అప్ ఏరియా X స్క్వేర్ ఫీట్ రేటు’ అనే సూత్రం ఒక ప్రాథమిక అంచనా మాత్రమేనని గుర్తుంచుకోవాలి. బిల్డర్లు చెప్పే స్క్వేర్ ఫీట్ రేటులో ఆర్కిటెక్ట్ లేదా ఇంజనీర్ ఫీజులు, ప్లాన్ అప్రూవల్, ప్రభుత్వ అనుమతుల ఖర్చులు, సాయిల్ టెస్టింగ్, కాంపౌండ్ వాల్, నీరు-డ్రైనేజీ కనెక్షన్లు, అలాగే మీరు ఎంచుకునే లగ్జరీ టైల్స్ లేదా శానిటరీ ఫిట్టింగ్స్ ఖర్చులు సాధారణంగా కవర్ కావు. కాబట్టి ప్లాన్, స్ట్రక్చరల్ అవసరాలు, మెటీరియల్ క్వాలిటీని బట్టి ఐటమ్-వైజ్ అంచనా వేసుకున్నప్పుడే చివరిగా ఖచ్చితమైన ఫిగర్ చేతికి వస్తుంది. ఏది ఏమైనా, నిర్మాణంలోకి అడుగుపెట్టే ముందు ఈ చిన్న లెక్క మీ జేబుకు తగినట్లు ప్లాన్ చేసుకోవడానికి ఒక మంచి రోడ్‌మ్యాప్‌ను ఇస్తుంది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?