Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పాతనగరంలో మెట్రో రైల్ విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా దారుల్ షిఫా నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 7.5 కిలోమీటర్ల ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ మార్గంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మెట్రో రైల్ చీఫ్ ఇంజినీర్ ఎస్. భాస్కర్ రెడ్డితో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా ప్రభావితమవుతున్న మొత్తం 888 ఆస్తులలో ఇప్పటికే 833 ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మిగిలిన 55 ఆస్తులలో ఉన్న పురాతన భవనాలు, వారసత్వ కట్టడాలకు ఎలాంటి హాని కలగకుండా మెట్రో మార్గాన్ని విస్తరించేందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. అనేక ప్రతిబంధకాల మధ్య భూసేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన రెవెన్యూ అధికారుల కృషిని అజిత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ తీగలు, స్తంభాలు, వాటర్ వర్క్స్ పైపులు తదితర యుటిలిటీలను సురక్షితంగా, వేగంగా వేరే ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. అలాగే భూసేకరణ పూర్తయిన ఆస్తులను త్వరితగతిన తొలగించి, పనులు చేపట్టడానికి అనువుగా రైట్ ఆఫ్ వే (ROW) సాధించేలా సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఓల్డ్ సిటీలో మెట్రో రైలు రాక పట్ల స్థానిక ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, పనుల పురోగతికి తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని శాఖల అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి మెట్రో ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!