NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK111 vs King100: క్రిస్మస్ 2026 సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఇప్పటినుంచే హీట్ పెంచుతోంది. ఈ పండుగ సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలకు కీలకం గా ఉంటుంది. సెలవులు ఉండటంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక కూడా పెరుగుతుంది. అందుకే స్టార్ హీరోల సినిమాలు క్రిస్మస్, సంక్రాంతి వంటి సీజన్లను టార్గెట్ చేస్తుంటాయి. కానీ ఈసారి క్రిస్మస్ రేసు మాత్రం ఒక సినిమాతో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ NBK111 2026డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తుండగా, తాజాగా నాగార్జున ‘కింగ్100’ కూడా అదే తేదీని లాక్ చేసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద ఇద్దరు సీనియర్ సూపర్స్టార్ల మధ్య నేరుగా పోటీకి రంగం సిద్ధమైంది.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK111పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ఇటీవల బాలకృష్ణకు గాయం కావడంతో సినిమా కొంత ఆలస్యం ఎదురైనట్లు సమాచారం. అయినప్పటికీ రిలీజ్ డేట్ ని మార్చకుండా క్రిస్మస్ సీజన్‌ను టార్గెట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పండుగ సెలవులు, బాలకృష్ణకు ఉన్న మాస్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుంటే డిసెంబర్ 24 తేదీ నిర్మాతలకు కూడా కీలకంగా మారింది.
Also Read
- Irummudi: ‘బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
ఇదే సమయంలో నాగార్జున తన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంగా తెరకెక్కిస్తున్న ‘కింగ్100’ను కూడా డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రా. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నాగార్జునకు చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. 100వ సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. క్రిస్మస్ సీజన్లోనే ఈ మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించడంతో బాలయ్య సినిమాతో నేరుగా క్లాష్ ఏర్పడింది.
ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు ఒకే రోజున వస్తే ప్రధానంగా థియేటర్ల కేటాయింపుపైనే ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో స్క్రీన్ షేరింగ్ కీలకంగా మారుతుంది. రెండు సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఒకే రోజు విడుదల కావడంతో మొదటి వారంలో థియేటర్ల సంఖ్య, షోల కేటాయింపు విషయంలో పోటీ తప్పకపోవచ్చు.
ఇది ఇలా ఉంటే ఈ పోటీకి బాలీవుడ్ నుంచి మరో పెద్ద సినిమా కూడా చేరుతోంది. షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ కూడా అదే క్రిస్మస్ సీజన్‌ను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం NBK111, ‘కింగ్100’ స్థాయిలో దీనికి పోటీ ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. షారుఖ్ ఖాన్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, ఇద్దరు తెలుగు సీనియర్ స్టార్ హీరోల సినిమాల మధ్యే పోటీనే ఆసక్తికరంగా మారనుంది.
అయితే ఈ క్రిస్మస్ రేసులో అసలు ఆందోళన కలిగిస్తున్న మరో సినిమా ఉంది. అదే మార్వెల్ స్టూడియోస్‌కు చెందిన ‘Avengers: Doomsday’. ఈ చిత్రం డిసెంబర్ 18, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంటే NBK111, ‘కింగ్100’ సినిమాలు థియేటర్లలోకి రావడానికి కేవలం వారం రోజుల ముందే ఈ హాలీవుడ్ బిగ్గీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మార్వెల్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఉన్న భారీ ఫ్యాన్ బేస్ కారణంగా థియేటర్లపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హాలీవుడ్ సినిమాలకు ఇస్తున్న ఆదరణను తక్కువగా అంచనా వేయలేం. ఇటీవల ‘ది ఒడిస్సీ’, ‘స్పైడర్ మ్యాన్’ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలు ప్రాంతీయ సినిమాల పోటీ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్నాయి. దీంతో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’కు కూడా భారీ స్పందన వస్తే, క్రిస్మస్ వారంలో స్క్రీన్ల కోసం పోటీ మరింత తీవ్రం కావచ్చు.
మొత్తంగా చూస్తే 2026 క్రిస్మస్ సీజన్ టాలీవుడ్లో ఇప్పటినుంచే భారీ పోటీకి వేదికగా మారింది. ఒకవైపు బాలకృష్ణ NBK111, మరోవైపు నాగార్జున ‘కింగ్100’ ఒకే రోజున రావాలని నిర్ణయించుకోవడం ఆసక్తిని పెంచుతుండగా, షారుఖ్ ఖాన్ ‘కింగ్’, ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ వంటి భారీ చిత్రాలు కూడా అదే సీజన్లో ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. మరి డిసెంబర్ 24 క్లాష్‌ను బాలయ్య, నాగార్జున సినిమాలు నిజంగానే కొనసాగిస్తాయా? లేక బాక్సాఫీస్ రిస్క్‌ను దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషంలో ఒకరు వెనక్కి తగ్గుతారా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
తాజావార్తలు
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!