Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
- మహిళల హాకీ ప్రపంచకప్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న అర్జెంటీనా..
- నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా..
- షూటౌట్లో 3-1తో నెదర్లాండ్స్‌ను ఓడించిన అర్జెంటీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో సంచలన విజయం నమోదైంది. హాకీలో చిరకాల ప్రత్యర్థులైన అర్జెంటీనా, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. నెదర్లాండ్స్ సొంతగడ్డపై జరిగిన ఈ పోరులో అర్జెంటీనా షూటౌట్లో 3-1 తేడాతో విజయం సాధించి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో 16 ఏళ్ల తర్వాత అర్జెంటీనా తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
అమ్స్టెల్వీన్లో శనివారం జరిగిన ఈ ఫైనల్లో నిర్ణీత 60 నిమిషాల ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ను ఆశ్రయించారు. అక్కడ అర్జెంటీనా గోల్‌కీపర్ క్రిస్టినా కొసెంటినో అద్బుతుంగా రాణించి ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించింది. దీనితో చివరకు అర్జెంటీనా 3-1తో షూటౌట్‌ను గెలిచి విశ్వ విజేతగా నిలిచింది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మ్యాచ్ తొలి క్వార్టర్లో ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయినా.. మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగింది. రెండో క్వార్టర్లో అర్జెంటీనా దూకుడు పెంచి ఎక్కువ సమయం బంతిని తన ఆధీనంలో ఉంచుకుంది. అయితే అర్జెంటీనా ఒత్తిడిని తట్టుకున్న నెదర్లాండ్స్ కీలక సమయంలో గోల్ సాధించింది. రెండో క్వార్టర్ ముగియడానికి కేవలం 51 సెకన్ల ముందు నెదర్లాండ్స్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన యిబ్బీ జాన్సెన్ దాన్ని గోల్‌గా మలిచింది. దీంతో నెదర్లాండ్స్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లి తొలి అర్ధభాగాన్ని ముగించింది.
మూడో క్వార్టర్లో అర్జెంటీనా సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. వరుసగా రెండు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ వాటిని గోల్‌గా మార్చలేకపోయింది. దీంతో మూడో క్వార్టర్ ముగిసే సమయానికి నెదర్లాండ్స్ 1-0 ఆధిక్యంలోనే ఉంది. చివరి క్వార్టర్ ప్రారంభమైన కొద్దిసేపటికే అర్జెంటీనాకు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ అవకాశాన్ని విక్టోరియా గ్రనాట్టో సద్వినియోగం చేసుకుని గోల్ సాధించింది. దీంతో స్కోరు 1-1గా మారింది. ఆ తర్వాత ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ నిర్ణీత సమయం ముగిసేలోపు మరో గోల్ నమోదు కాలేదు.
ఫైనల్ మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. నెదర్లాండ్స్ తరఫున తొలి ప్రయత్నం చేసిన పియెన్ సాండర్స్‌ను అర్జెంటీనా గోల్‌కీపర్ క్రిస్టినా కొసెంటినో అడ్డుకుంది. మరోవైపు అర్జెంటీనా తరఫున గ్రనాట్టో గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించింది. ఆ తర్వాత ఫెలిస్ అల్బర్స్ ప్రయత్నాన్ని కూడా కొసెంటినో నిలువరించింది. అర్జెంటీనా తరఫున బ్రిసా బ్రుగెసర్ మరో గోల్ సాధించడంతో ఆధిక్యం 2-0కి చేరింది. నెదర్లాండ్స్ తరఫున మారిజన్ వీన్ ఒక గోల్ చేసినప్పటికీ.. చివర్లో ఫ్రీకే మోస్ గోల్ చేయలేకపోయింది. దీంతో సోఫియా కైరో చివరి ప్రయత్నాన్ని గోల్‌గా మలచడంతో అర్జెంటీనా 3-1తో షూటౌట్‌ను గెలుచుకుంది.
ఈ విజయంతో అర్జెంటీనా మహిళల హాకీ జట్టు 16 ఏళ్ల ప్రపంచకప్ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. చివరిసారిగా 2010లో ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా.. ఇప్పుడు మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అంతేకాకుండా వరుసగా నాలుగు ప్రపంచకప్‌లు గెలవాలన్న నెదర్లాండ్స్ ఆశలకు కూడా గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా, నెదర్లాండ్స్ గతంలో నాలుగుసార్లు తలపడగా.. ఇరు జట్లు చెరో రెండు విజయాలు సాధించాయి. 2022 ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనాను నెదర్లాండ్స్ ఓడించింది. ఈసారి అదే ప్రత్యర్థిపై అర్జెంటీనా ప్రతీకారం తీర్చుకుంది.
A night Argentina will never forget. 🇦🇷🏆
Las Leonas are Women’s Hockey World Champions
A 1-1 thriller, then 3-1 in the shoot-out against the
Netherlands — on Dutch soilArgentina’s third World Cup. A third golden star. 🦁💙#HockeyWorldCup #LasLeonas #Argentina 🇦🇷#Dutch pic.twitter.com/mkq0hHANxi
— Anil Bansal (@dilseanilbansal) August 29, 2026
నెదర్లాండ్స్ ఓటమితో ఆ జట్టు స్టార్ ఆటగాడు, రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయిన జాన్ డి వార్డ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ప్రపంచకప్ అనంతరం ఎలైట్ హాకీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఇప్పటికే ప్రకటించింది. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నప్పటికీ.. సొంతగడ్డపై టైటిల్ గెలవలేకపోవడం ఆమెకు నిరాశ మిగిల్చింది. ఇదిలా ఉండగా, మహిళల కాంస్య పతక పోరులో బెల్జియం 1-0తో ఆస్ట్రేలియాను ఓడించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల ప్రపంచకప్ ముగియగా.. ఆగస్టు 30న పురుషుల ఫైనల్‌తో 2026 హాకీ ప్రపంచకప్ ముగియనుంది. బెల్జియంలోని వావ్రేలో కొత్తగా నిర్మించిన బెల్ఫియస్ హాకీ అరేనాలో స్పెయిన్, జర్మనీ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
🇦🇷🔥 The Dutch dominance is finally broken! Argentina are the Women’s Hockey World Cup 2026 Champions! 🏆💪😍
Argentina held the Netherlands to a 1-1 draw before winning the shootout 3-1 to lift their third World Cup title. What a comeback! 🇦🇷❤️#Hockey #FIH #HWC2026 #Argentina pic.twitter.com/8w1MAFaQSU
— Sunanda Acharya (@Sunanda_Iam) August 30, 2026
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!