Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irummudi: తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద రవితేజ ‘ఇరుముడి’ జోరు చూస్తుంటే ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. రోజులు గడిచేకొద్ది భారీ సినిమాలకు కూడా వసూళ్లు కూడా క్రమంగా తగ్గుతుంటాయి. కానీ ‘ఇరుముడి’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. తాజాగా రెండో శుక్రవారం వచ్చిన వసూళ్లు ఇప్పుడు టాలీవుడ్‌లోని పలు భారీ బ్లాక్బస్టర్ల రికార్డులను గుర్తు చేస్తోంది ఈ మూవీ. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘ఇరుముడి’ రెండో శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.12 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే రోజున ‘ఆర్ఆర్ఆర్’ సుమారు రూ.15 కోట్ల వసూళ్లు సాధించింది. అంటే రవితేజ సినిమా కేవలం కొద్దిగా వెనుకబడి ఉండగా, మిగిలిన పలు భారీ చిత్రాల వసూళ్లను మాత్రం అధిగమించినట్లు తెలుస్తోంది. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ రెండో శుక్రవారం సుమారు రూ.10.5 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇక అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ రెండో శుక్రవారం దాదాపు రూ.9 కోట్లు, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సుమారు రూ.7 కోట్ల వసూళ్లు నమోదు చేశాయి. ఈ లెక్కలతో పోలిస్తే ‘ఇరుముడి’ రూ.12 కోట్ల రెండో శుక్రవారం గ్రాస్ సాధించడం విశేషం.
విడుదలైన తొలి వారంలోనే ‘ఇరుముడి’ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టింది. దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లోనూ మంచి ఆక్యుపెన్సీ నమోదవడంతో సినిమాకు ప్రారంభం నుంచే పాజిటివ్ ట్రెండ్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి వచ్చిన మౌత్ టాక్ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల నెట్ మార్కును కూడా దాటేసింది. విడుదలైన ఎనిమిదో రోజుకే ఈ మైలురాయిని అందుకోవడం సినిమాకు ఉన్న ప్రేక్షకాదరణను స్పష్టంగా చూపిస్తోంది. అంతేకాదు ఈ మూవీ ఇప్పటికే 150 కోట్ల మార్కును దాటి 200 కోట్ల క్లబ్ లో కూడా చెరబోతోంది. మొదటి వారంలోనే భారీ వసూళ్లు రాబట్టిన సినిమా, రెండో వారంలోనూ అదే స్థాయిలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
మరోవైపు యష్ నటించిన ‘టాక్సిక్’ వంటి భారీ సినిమా బాక్సాఫీస్ బరిలో ఉన్నప్పటికీ ‘ఇరుముడి’ తన వసూళ్లను నిలబెట్టుకోవడం కూడా ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పెద్ద స్టార్ సినిమా విడుదలైనప్పుడు అదే సమయంలో థియేటర్లలో ఉన్న ఇతర చిత్రాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కానీ ‘ఇరుముడి’కు వచ్చిన ప్రేక్షకాదరణ ఆ ప్రభావాన్ని పెద్దగా పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే, ‘ఇరుముడి’ కేవలం మంచి ఓపెనింగ్‌తో ఆగిపోకుండా రెండో వారంలోనూ బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్‌కు చేరువగా రెండో శుక్రవారం వసూళ్లు సాధించడం, ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి చిత్రాల కంటే మెరుగైన లెక్కలు నమోదు చేయడం రవితేజ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే ‘ఇరుముడి’ రవితేజ కెరీర్లోనే మరిన్ని కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!