TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG SAFE: హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో కూడిన ఆరు బృందాలు ఏకకాలంలో ఏడు ప్రముఖ రెస్టారెంట్లలో ఈ దాడులు చేపట్టాయి. చట్నీస్, పిస్తా హౌస్, హోరిస్, స్పైస్ ఎవెన్యూ వంటి నాలుగు ప్రముఖ హోటళ్లలో తీవ్రస్థాయి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన, నాసిరకం ఆహార వస్తువులను ఉపయోగించి పదార్థాలు తయారు చేస్తున్నట్లు తేలడంతో ఈ నాలుగు ప్రముఖ హోటళ్లకు టీజీ సేఫ్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
తనిఖీల సందర్భంగా పలు రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపించడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, నిర్వహణలో నిబంధనలు పాటించకపోవడం వంటి తీవ్ర లోపాలు వెలుగుచూశాయి. కొన్ని చోట్ల కుళ్లిపోయిన కూరగాయలు వాడటం, ఆహార పదార్థాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (FSS) లేబులింగ్ మరియు డిస్ప్లే నిబంధనలను ఉల్లంఘించడం, పురుగుల బెడద ఉండటాన్ని అధికారులు గమనించారు. ఈ క్రమంలో కల్తీ అనుమానం ఉన్న 11 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు. వెంటనే నిబంధనలు సరిదిద్దుకోవాలని ఆదేశిస్తూ నాలుగు ఇంప్రూవ్మెంట్ నోటీసులు, మూడు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
గచ్చిబౌలిలోని పిస్తా హౌస్‌లో జరిపిన తనిఖీల్లో స్టోర్ ఏరియాలో పెద్దఎత్తున ఉల్లంఘనలు బయటపడ్డాయి. మిస్‌బ్రాండింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి సుమారు రూ.17,500 విలువైన 15 కిలోల జీడిపప్పు, 24 కిలోల డ్రై నూడుల్స్, 5 కిలోల పొటాటో చిప్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అంతేకాకుండా అక్కడి మస్కటి నెయ్యి, వంగల్ పనీర్ నమూనాలను సేకరించి నాణ్యత పరిశీలన కోసం పరీక్షలకు పంపించారు. మరొకవైపు జూబ్లీహిల్స్‌లోని స్పైసీ వెన్యూ, చట్నీస్ తదితర రెస్టారెంట్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అధికారికంగా విడుదల చేసిన అధికారులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క రెస్టారెంట్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!