ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు లిక్కర్ పాలసీ వ్యవహారం తాజాగా మరోసారి కాక రేపుతోంది. మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కాగ్ పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Atishi: ఢిల్లీ లిక్కర్ కేసులో నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. ఈ రోజు జరిగిన ఆప్ శానససభ పక్ష సమావేశంలో ఢిల్లీకి కొత్త సీఎంగా అతిషీ మార్లేనాని ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఖరారైన తర్వాత తొలిసారిగా అతిషీ స్పందించారు. కేజ్రీవాల్‌ని తన గురువుగా అభివర్ణించారు. తదుపరి ఎన్నికల్లో కేజ్రీవాల్‌ని సీఎం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన రాజకీయాల్లో సంచలనంగా మారింది. రెండు రోజు తర్వాత తాను రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలు తనను నిజాయితీపరుడని తీర్పు ఇచ్చే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే, కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్ ఎద్దేవా చేస్తున్నాయి. రెండు రోజుల తర్వాత రాజకీనామా చేయాల్సిన అవసరం ఏంటని, ఇప్పుడే చేయొచ్చు కదా.. అంటూ సెటైర్లు వేస్తున్నాయి.
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కస్టడీని ట్రయల్ కోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కస్టడీ బుధవారంతో ముగియడంతో మరోసారి కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వచ్చే మంగళవారానికి తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు.
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ కేసులో 17 నెలలుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియా నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశంలో ‘నియంతృత్వ పాలన’కు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పోరాడాలని ఆయన పిలునిచ్చారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆయన తల్లిదండ్రులను మమత పరామర్శించారు.
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితను కేటీఆర్ కలవనున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌ని చంపేందుకు కుట్ర జరగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.