రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- TECNO SPARK Go 3 Pro భారత్‌లో రూ.15,999 ప్రారంభ ధర..
- ఎంట్రీ లెవల్ విభాగంలో ప్రత్యేకతగా IP69 రేటింగ్
- 6.78 అంగుళాల డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- 5,200mAh బ్యాటరీ, 15W ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TECNO SPARK Go 3 Pro Launched: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో టెక్నో (TECNO) సంస్థ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. TECNO SPARK Go 3 Pro పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ విభాగంలో IP69 రేటింగ్ అందించడం ఈ ఫోన్‌కు ప్రాముఖ్యతను తెలుపుతుంది. దుమ్ము, నీటి అధిక పీడన జెట్లు, అనుకోకుండా ఫోన్ కిందపడటం వంటి పరిస్థితులను తట్టుకునేలా దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. టెక్నో ఈ ఫోన్‌ను రోజువారీ కఠినమైన వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. ముఖ్యంగా డెలివరీ ఉద్యోగులు, వ్యవసాయ రంగంలో పనిచేసేవారు, బయట ఎక్కువగా తిరిగే వారు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ఉపయోగపడేలా దీని డిజైన్, డ్యూరబిలిటీపై కంపెనీ దృష్టి పెట్టింది.
డిస్ప్లే:
TECNO SPARK Go 3 Proలో 6.78 అంగుళాల డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రోలింగ్, యాప్‌ల మధ్య నావిగేషన్, ఇతర విజువల్ కంటెంట్‌ను మరింత స్మూత్‌గా ఆస్వాదించవచ్చు. ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ IP69 రేటింగ్. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఈ స్థాయి డ్యూరబిలిటీ రేటింగ్‌ను అందించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దుమ్ము, అధిక పీడనంతో వచ్చే నీటి జెట్ల నుంచి రక్షణతో పాటు అనుకోకుండా ఫోన్ కిందపడే పరిస్థితులను తట్టుకునేలా ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
Also Read
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

బ్యాటరీ:
బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5,200mAh బ్యాటరీ ఉంది. రోజువారీ వినియోగంలో ఎక్కువసేపు పనిచేసేలా దీనిని రూపొందించారు. ఫోన్‌కు 15W ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. దీంతో సాధారణ వినియోగంలో రోజంతా బ్యాటరీ బ్యాకప్ అందించేలా ఈ ఫోన్‌ను కంపెనీ తీసుకొచ్చింది.
AI నాయిస్ క్యాన్సిలేషన్:
కాల్ క్వాలిటీని మెరుగుపరిచేందుకు ఇందులో AI Voiceprint Noise Cancellation టెక్నాలజీని అందించారు. చుట్టూ ఎక్కువగా శబ్దం ఉన్న ప్రదేశాల్లో కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను ఫిల్టర్ చేయడంలో ఈ టెక్నాలజీ సహాయపడుతుంది.
డ్యూయల్ స్పీకర్లు, DTS సపోర్ట్:
ఆడియో విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. వీటికి DTS సపోర్ట్ కూడా అందించారు. దీంతో వీడియోలు, సంగీతం, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను మెరుగైన ఆడియో అనుభవంతో ఆస్వాదించవచ్చు. ఇందులో మరో ఉపయోగకరమైన ఫీచర్‌గా ఇన్ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్‌ను అందించారు. దీని ద్వారా అనుకూలమైన టీవీలు, ఏసీలు వంటి కొన్ని హోమ్ అప్లయెన్సులను ఫోన్‌నే రిమోట్‌గా ఉపయోగించి నియంత్రించుకోవచ్చు.
ధర:
భారత్‌లో ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.15,999 కాగా, 4GB RAM + 128GB స్టోరేజ్ రూ.16,999 గా నిరనయించారు. ఈ మొబైల్స్ సెప్టెంబర్ 4, 2026 నుంచి భారతదేశంలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఆఫ్‌లైన్ రిటైల్ పార్ట్నర్ స్టోర్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!