మీ సేవింగ్స్, కరెంట్ అకౌంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి బ్యాంకు పేరుతో కనిపించే నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు ఇచ్చారంటే మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయి. తస్మాత్ జాగ్రత్త. కామారెడ్డి జిల్లా కి చెందిన ఓ కస్టమర్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది.
కామారెడ్డి వాసి జొన్నల ప్రసాద్ ఏటీఎం కార్డు కోసం ఇంటర్నెట్లో దొరికిన నెంబర్ కి ఫోన్ చేస్తే ఖాతా నుంచి అక్షరాలా 2,79,999 రూపాయలు మాయం అయిపోయాయి. ఐసీఐసీఐ కస్టమర్ కేర్ కోసం వెతికిన ప్రసాద్ కి ఓ నంబర్ దొరికింది. ఆ నంబర్ కి ఫోన్ చేసిన ప్రసాద్ కి అవతలి నుంచి కొన్ని సూచనలు లభించాయి.
వాటిని తూ.చ తప్పకుండా పాటించాడు ఆ కస్టమర్. ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడా కాలర్. దీంతో ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయి వివరాలు చెప్పాడు ప్రసాద్. అంతే… అకౌంట్ లో నుంచి 2,79,999 రూపాయలు పోగొట్టుకున్నాడు ప్రసాద్. మోసపోయినట్లు గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ప్రసాద్. జరిగిన విషయాన్నికంప్లైంట్ చేశాడు ప్రసాద్. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.