Shamirpet Incident: శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamirpet Celebrity Resort: హైదరాబాద్ శివార్లలోని సమీర్‌పేట కాల్పుల ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా పిల్లలతో పాటు భార్య.. భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
ఏం జరిగింది..
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
సిద్ధార్థ దాస్, స్మిత దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే 2019లో విభేదాల కారణంగా స్మిత తన భర్త నుంచి విడిపోయింది. అయితే స్మిత మాత్రం మనోజ్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వారు ప్రస్తుతం సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో నివసిస్తున్నారు. కానీ స్మిత పిల్లలను కూడా ఉంచుకుంది. పిల్లల సంరక్షణ కోసం సిద్ధార్థ దాస్ స్మిత విల్లాకు వచ్చాడు. అక్కడ జరిగిన ఘర్షణలో మనోజ్ కుమార్ ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. ఈ విషయాన్ని సిద్ధార్థ దాస్ పోలీసులకు సమాచారం అందించాడు. అలాగే ఎయిర్ గన్ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. మనోజ్ పిల్లలను కొట్టాడని సిద్ధార్థ దాస్ ఆరోపిస్తున్నాడు. అయితే అలాంటిదేమీ లేదని స్మిత చెబుతున్నట్లు తెలుస్తోంది.
Read also: Raja Singh: రాజాసింగ్‌కు మరో షాక్.. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్ గౌడ్..?
ఇదిలావుంటే, ఇప్పటికే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సిదార్థ్-స్మితాల కొడుకు లేఖ రాశాడు. అందులో మనోజ్ తమతో పనులు చేయించడంతో పాటు వేధిస్తున్నాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల శిశు సంక్షేమ కమిటీ సిద్ధార్థ్-స్మితల కుమారుడిని వారి సంరక్షణలో ఉంచింది. అయితే మనోజ్ తన సోదరిని కూడా కొడుతున్నాడని సిడబ్ల్యుసితో పాటు తన తండ్రి సిద్ధార్థ దాస్‌కు చెప్పాడు. ఈ క్రమంలో సిద్ధార్థ దాస్ విశాఖ నుంచి శామీర్ పేట చేరుకున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ వైజాగ్‌లో పనిచేస్తున్నాడు. అలాగే స్మిత, మనోజ్‌లు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నారని సమాచారం. మనోజ్ కొన్ని సీరియల్స్‌లో కూడా నటించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురి స్టేట్‌మెంట్‌ను నమోదు చేయనున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!