Chief ministers: తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ అంశాలపై ముగ్గురు ముఖ్యమంత్రులు మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. కాగా.. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ప్రగతి భవన్‌కు చేరుకోగానే ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్ భోజనం చేశారు. జాతీయ రాజకీయాలకు, భారత సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్షాల మద్దతు కోరుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు సీఎంల భేటీలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని గ్రూప్-ఎ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణా చర్యలు తదితర ముఖ్యమైన విషయాలను కేంద్రం తీసుకుంది. ఇందుకోసం కేంద్రం ఈ నెల 19న ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. సంబంధిత ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు తీసుకునేందుకు నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి అధ్యక్షుడిగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఆర్డినెన్స్ ప్రకారం మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయి. కాగా, ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును అమలు చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆర్డినెన్స్ ద్వారా అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ఇప్పటికే పలువురు నేతలను కలిశారు. ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
Harish Rao: కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు.. రేవంత్, బండి సంజయ్ పై హరీశ్ రావ్ కీలక వ్యాఖ్యలు