Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగిలిపోతుంది. రెండు జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిభద్రతలను పరీరక్షించడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలం కావడంతో ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరించుకుంది.
ఒడిశా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ దేవాలయంలో గల నాలుగు ద్వారాలు ఇవాళ తెరచుకున్నాయి. ఈ ఉదయం వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీతో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు.
బీజేపీ సీనియర్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఖట్టర్ కర్నాల్‌లో మాట్లాడుతూ..
పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్లను కోర్టు మార్చి 19న విచారించనుంది. CAA కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను జారీ చేసిన ఒక రోజు తర్వాత, కేరళకు చెందిన రాజకీయ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నిబంధనల అమలుపై స్టే విధించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాని ఆశ్రయించింది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది.. మేము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై ఓవైసీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
ఈనెల 15న విజయవాడలో జరుగనున్న ప్రజా రక్షణ భేరి సభ విజయవంతం కోసం సీపీఎం సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
KTR: జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులకు మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. రెజర్ల పట్ల ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ ఖండించారు. అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
Chief ministers: మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ అంశాలపై ముగ్గురు ముఖ్యమంత్రులు మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.