Harish Rao: తెలంగాణ రాష్ట్రం లేకుంటే రేవంత్, బండి సంజయ్ లకు రాష్ట్ర అధ్యక్షుడి పదవులు వచ్చేవా? కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు అనుభవిస్తున్నారని మంత్రి హరీశ్ రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో 100 పడకల నూతన ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. లక్ష్మారెడ్డి కృషితో అన్ని సకల సౌకర్యాలతో జడ్చర్లలో వంద పడకల ఆసుపత్రి నిర్మించుకుని ప్రారంభించుకున్నామని అన్నారు. బట్టకాల్చి మీద వేయడం, గోబెల్స్ ప్రచారం చేయడమే రేవంత్ పని అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మరో 20 ఏళ్లు అయినా ఒక్క మెడికల్ కాలేజీ వచ్చి ఉండేది కాదన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీ లు నిర్మించుకున్నామన్నారు. గతంలో కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఒక్క ఆసుపత్రి కూడా తీసుకురాలేదని ఎద్దేవ చేశారు.
కానీ.. అప్పుడు మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి కొడంగల్ కు వంద పడకల ఆసుపత్రి ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పాలమూరుకు కరువు, కాటకాలు , వలసలను ఇచ్చిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల కంటే కూడా ప్రతిపక్ష పార్టీలు దారుణంగా తరయ్యాయని మండిపడ్డారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం లేకుంటే రేవంత్, బండి సంజయ్ లకు రాష్ట్ర అధ్యక్షుడి పదవులు వచ్చేవా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పెట్టిన భిక్షతోనే పదవులు అనుభవిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు చెడ గొట్టే పనులు తప్ప మంచి చేసే పనులు మాత్రం చేయరని తీవ్రంగా మండిపడ్డారు. ఆనాడు ఉద్యమంలో కలిసి రాలేదు. ఈనాడు ఉత్సవాలు జరుపుకోవద్దు అంటున్న కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ కారులను, అమరులను అవమానపర్చినట్లే అంటూ మండిపడ్డారు. ఈ 9 ఏళ్ల BRS పాలనలో ప్రజలు పాస్ అయ్యారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ పాలన వద్దని రాష్ర్టం మొత్తం ముక్తకంఠంతో చెబుతుందని అన్నారు. 50 సిట్లల్లో అభ్యర్థులే లేరు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని అన్నారు. చిన్న కల్వకుర్తి ప్రాజెక్టును కట్టేందుకు కాంగ్రెస్ కు 20 ఏళ్లు పట్టింది. అంతకు పదింతలు రెట్టింపైన పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టును వేగంగా కట్టుకుంటున్నామని తెలిపారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని 8 ఏళ్లలో BRS ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు. ఆనాడు పాలమూరు నుంచి వలసలు పోతే నేడు ఇదే వలసల జిల్లాకు ఇతర జిల్లాలు, రాష్టల నుంచి వలస వచ్చి కూలీ పనులు చేయిస్తున్నారని తెలిపారు. పాలమూరు జిల్లాలో 14 స్థానాల్లో BRS పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తమ పాలన తెస్తాం అంటే .. గతంలో ఉన్న 200 ఫించెన్ ను తెచ్చుకోవడం, దళిత, రైతు బందులను వదులుకోవడమే అని హరీశ్ రావ్ తెలిపారు.
Sandra Venkata Veeraiah: కావాలనే పోడుపై ధర్నాలు.. సండ్ర సీరియస్