Delhi liquor Case : మద్యం పాలసీ కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ముడిపడిన మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది 'ఇండియా' కూటమికి పెద్ద విజయం అని అభివర్ణించారు. ఇండియా కూటమికి ఇది తొలి విజయమని, దీనికి అర్థం ఎంతో ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి సుప్రీం నిర్ణయంపై కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ పట్టు బిగిస్తోంది. కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంపిన 5 సమన్లపై ఆప్ అధినేత ఇప్పటి వరకు స్పందించలేదు.. దీంతో దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తుందనే ఊహాగానాల నడుమ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం ఏంటంటే.. అవినీతే జరగలేదని, బీజేపీ తనను అరెస్ట్ చేయాలని అనుకుంటోందని ఆయన అన్నారు. నా పెద్ద ఆస్తి నిజాయితీ అని, వారు దానిని దెబ్బతీయాలనుకుంటున్నారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. తనకు పంపిని ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. బీజేపీ లక్ష్యం తనను అరెస్ట్ చేయించడమే కాదని,…
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలిపింది. ఇప్పటి వరకు మూడు సార్లు కేజ్రీవాల్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా మూడోసారి కూడా సమన్లను దాటవేశాడు. అయితే ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, కేవలం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడమే లక్ష్యమని ఆప్ ఆరోపించింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లపై గందరగోళం మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈడీ సమన్లకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్‌ను ఈడీ ప్రశ్నించేందుకు సమన్లు పంపింది. నవంబర్ 2న ఈడీ ముందు హాజరుకావాలని తెలిపింది. అయితే సీఎం కేజ్రీవాల్ మాత్రం హాజరుకాలేదు.
CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ ప్రజలను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలి నాణ్యత వరుసగా నాలుగో రోజు పడిపోయింది. సోమవారం ఉదయం 9 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 437గా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకటించింది. అయితే గత మూడు రోజులతో పోలిస్తే కాస్త తగ్గింది. కాగా, వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (సీఎం అరవింద్ కేజ్రీవాల్) ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే…
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుని మైనర్ కూతురిని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి లైగింకంగా వేధించాడు. ఉన్నతాధికారి లైగింకవేధింపుల మూలంగా మైనర్ బాలిక గర్భం దాల్చింది.