రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ యాత్రను అస్సాం లో బీజేపీ నాయకులు(గుండాలు ) అడ్డుకొని దాడి కి ప్రయత్నించడం దారుణమన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యాత్ర పై బీజేపీ గుండాల దాడిని ఖండిస్తున్నానన్నారు. రాహుల్ గాంధీ గారు దేశంలో జరుగుతున్న పరిణామల పై న్యాయం జరుగలని అలాగే న్యాయ యాత్ర చేస్తున్నారని, అలాగే దేశంలో ద్వేషాలు కాదు ప్రేమ పెంపొందించాలని యాత్ర చేస్తుంటే బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గు చేటన్నారు జగ్గారెడ్డి. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి జరుగడం మంచిది కాదని, రాహుల్ గాంధీ గారు చేస్తున్న యాత్ర తో ప్రజల్లో మార్పు వస్తుందని బయపడి బీజేపీ నాయకులు ఇలా దాడులు చేస్తున్నారన్నారు. దేశంలో బీజేపీ ప్రజలకు అందుబాటులో లేకుండా పరిపాలన చేస్తుందని, దేశంలో న్యాయం కరువైపోయిందని రాహుల్ గాంధీ గారు న్యాయం కోసం యాత్ర చేస్తున్నారన్నారు.
అంతేకాకుండా.. ‘రాహుల్ గాంధీ గారు గతంలో కూడా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసిన విషయం అందరికి తెలిసిందే. దేశంలో ప్రజలందరూ అన్నదమ్ములుగా కలిసి ప్రేమ తో ఉండాలని చేశారు. అన్ని కులాలలు, మతాలు ఒక్కటేనాని ప్రేమ తో బ్రతకాలని భారత్ జోడో యాత్ర చేశారు. ఎందుకంటే ఇటీవాలే దేశంలో పెరుగుతున్న హింస చూస్తున్నాము. మణిపూర్ లో రెండు వర్గాల మధ్య జరిగిన హింస ఘటన పై కూడా రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం వైఫల్యాల పై మాట్లాడారు. దేశం లో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యలను ఎండగట్టాలని ప్రజలను మేలుకొల్పలని రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర చేస్తున్నారు. దేశంలో ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండాలని ప్రజల్లో ఒక మనోధైర్యం నింపడానికి రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తుంటే ఇలా బీజేపీ
నాయకులు దౌర్జన్యంగా అడ్డుకుంటారా. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ యాత్ర చేస్తుంటే ఇది సహించలేక బీజేపీ నాయకులు దాడి చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. అస్సాం లో బీజేపీ నాయకులు ప్రవర్తించిన తీరు సరికాదు దీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.’ అని అన్నారు జగ్గారెడ్డి.