10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ రద్దుపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. దీంతో బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం సాగనుంది.
తెలంగాణ పదో తరగతి పేపర్ లీకేజీ కేసు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెడకు చుట్టుకుంది. 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీక్ చేసినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్టుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బండి అరెస్ట్ పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. పేపర్ లీక్ కుంభకోణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందనడానికి ఆ ట్వీట్ మరో నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు.
ఒక పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేయాలంటే ముందు నోటీసులు ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. బండి సంజయ్ ని కలవడానికి వెళ్లనున్నట్లె తెలిపారు. అరెస్ట్ లకు బండి సంజయ్ భయపడరంటూ వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికత్త నెలకొంది. సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తు్న్నారు. సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికత్త నెలకొంది. సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తు్న్నారు. బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పిలుపు నిచ్చారు.
10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ కావడం రాజకీయంగా కూడా కలకలం రేపుతోంది. 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి బండిని అదుపులోకి తీసుకున్నారు.