KTR Slams CM: మీడియాతో చిట్ చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా నది ఎక్కడ ఉన్నది అడిగాడు.. భాక్రానంగాల్ ఏ రాష్ట్రంలో ఉందో తెలియదని సెటైర్లు వేశారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తి ఇవాళ నీటిపారుదల శాఖ సలహాదారుగా కొనసాగుతున్నారని మండిపడ్డారు. అయితే, వీళ్ళు నీటిపారుదల శాఖపై చర్చ అంటున్నారు.. దేని మీద చర్చ పెడుతున్నారో వీరికి తెలియదు.. బూతులు మాట్లాడాలి అంటే ఎన్ని రోజులైనా చర్చ పెడతారు.. సభలో సబ్జెక్ట్ లేనప్పుడు ఎన్ని రోజులు నడుపుతారని కేటీఆర్ ప్రశ్నించారు.
అయితే, నీటిపారుదల శాఖపై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారు.. తీరా కేసీఆర్ వస్తున్నాడు అని కాంగ్రెస్ వాళ్లు చర్చకు ప్రిపేర్ అవుతున్నారు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అలాగే, కౌశిక్ రెడ్డి మేడిగడ్డపై బాంబులు పెట్టీ పేల్చారని అన్నాడు.. ఎందుకంటే, హుజూరాబాద్ నియోజక వర్గంలోని తనుగుల వద్ద చెక్ డ్యామ్ పేల్చివేతలో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ హస్తం ఉందని ఆరోపించారు. ఆనాడు మేడిగడ్డ పేల్చారని ఫిర్యాదు చేశారు ఇంజనీర్లు.. కానీ, ఇప్పటి వరకు ఎందుకు మీరు విచారణ చేపట్టడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అడిగారు.