Ernakulam Express Fire Accident: టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో సంభవించిన అగ్నిప్రమాద సంఘటనపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందాలు పరిశోధన కొనసాగిస్తూ కీలక ఆధారాలను సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు మంటలలో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటన వెంటనే రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రయోగాత్మక ఆధారాల కోసం CC కెమెరా ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తోంది. దీనివల్ల ప్రమాదానికి ఉన్న కారణాల్ని విశ్లేషించడం కొనసాగుతున్నట్లు డీఆర్ఎం మోహిత్ సోనాకీయా తెలిపారు. FSL బృందాలు సేకరించిన ఆధారాల ఆధారంగా ప్రమాదానికి సంబంధించిన నిర్ధారణకు రావడం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.
మరో వైపు, ఈ ఈ దుర్ఘటనలో ఓ వృద్ధుడు సజీవదహనం కాగా.. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు… అయితే, మరణించిన సుందరం కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు రైల్వే అధికారులు.. కాగా, టాటానగర్ నుంచి ఎర్నాకుళం వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగగా.. రెండు బోగీలకు మంటలు అంటుకున్న దగ్ధమయ్యాయయి.. ఘటనపై రైల్వే సిబ్బంది, ఫైర్ బ్రిగేడ్ ల సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చినప్పటికీ.. రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి.. ప్రయాణికులను ఉన్నంతలో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.. ఈ ఘటనపై రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకీయా మాట్లాడుతూ.. కేంద్ర FSL బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయి. మొత్తం విపత్తు స్థానాన్ని పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజ్, శక్తి పరమైన సంబంధించిన డాటాను పరిశీలిస్తూ పూర్తి విచారణ చేపడుతున్నారు. ప్రమాదానికి వెల సాయం అందటానికి నివేదిక ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటాం.” అని పేర్కొన్నారు.