భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బండారు దత్తాత్రయ తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. సురవరం భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇది కూడా చదవండి: US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో నూతన రాయబారి నియామకం
విద్యార్థి నాయకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంత పోరాటం చేశారని దత్తాత్రేయ కొనియాడారు. నల్గొండ లోక్‌సభ సభ్యునిగా పార్లమెంటులో చురుకైన పాత్ర పోషించి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించారన్నారు. లోతైన జ్ఞానమున్న నాయకులని, నీతి నిజాయితీకి మారుపేరని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US: న్యూయార్క్‌లో బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. భారతీయులుగా అనుమానం!
సిద్ధాంత వైరుధ్యం ఉన్నప్పటికీ సురవరం సుధాకర్ రెడ్డి విమర్శలు సున్నితంగా చేసేవారని, అనేక విషయాలపై తనతో చర్చించి సమాధానం కూడా సూచించేవారని గుర్తుచేసుకున్నారు. తాను ఆహ్వానించినప్పుడు అనేక సార్లు ‘అలై బలై’ కార్యక్రమంలో పాలొన్నారన్నారు. మంచి మిత్రుడిని కోల్పోయానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని.. కష్ట సమయాన ఈ బాధను తట్టుకోవాలని… కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు.