అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. న్యూయార్క్ హైవేపై భారతీయులతో ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. నయాగరా జలపాతం నుంచి తిరిగి న్యూయార్క్‌కు వస్తుండగా బస్సు అదుపు తప్పి బఫెలో సమీపంలో బోల్తా పడింది.
ఇది కూడా చదవండి: Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే దంపతులు టీడీపీని బెదిరిస్తున్నారా..?
54 మంది పర్యాటకులు నయాగరా జలపాతాన్ని సందర్శించారు. తిరిగి న్యూయార్క్ నగరానికి తిరిగి వస్తున్నారు. అయితే డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో బఫెలోకు తూర్పున 25 మైళ్లు (40 కిలోమీటర్లు) దూరంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకుల్లో భారతీయులు, చైనీస్, ఫిలిప్పీన్స్ మూలాలకు చెందినవారు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Suryapet : బైక్ పై వెళ్తున్న ముగ్గురిని చంపేందుకు కారులో వెంబడించిన ఐదుగురు దుండగలు
డ్రైవర్ పరధ్యానంలో ఉండడంతో నియంత్రణ కోల్పోయినట్లుగా అధికారులు చెప్పారు. ఇక ప్రమాద విషయం తెలియగానే సంఘటనాస్థలికి న్యూయార్క్ రాష్ట్ర పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఐదుగురు చనిపోయారని.. మిగతా టూరిస్టులకు ప్రాణాపాయం తప్పిందని.. ఆస్పత్రిలో చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ఉన్నట్లుగా చెప్పారు. పిల్లలెవరూ చనిపోలేదని అమెరికా మీడియా పేర్కొంది. బస్సు కెనడా సరిహద్దులో ఉన్న నయాగరా జలపాతానికి వెళ్లి తిరిగి వస్తుండగా పెంబ్రోక్ సమీపంలోని హైవేపై ప్రమాదం జరిగిందని తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎనిమిది హెలికాప్టర్లు పాల్గొన్నాయి. డ్రైవర్ సజీవంగానే బతికి బయటపడ్డాడు. అతడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.