TGPSC: టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. డిసెంబర్ 3తో ప్రస్తుత చైర్మన్ మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ (నవంబర్ 30న) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2030 వరకు టీజీపీఎస్సీ చైర్మన్ గా వెంకటేశం కొనసాగనున్నారు. బుర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన బుర్రా వెంకటేశం ప్రస్తుతం ఉన్న అన్ని పదవులకు రాజీనామా చేయనున్నారు. ఆయన ఇప్పటికే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. డిసెంబరు 2న వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియామకం కావడం సంతోషంగా ఉందని వెంకటేశం అన్నారు.
Read also: Revanth Reddy Tweet: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్..
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత బుర్రా వెంకటేశం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సమాచార పౌరసంబంధాల కమిషనర్‌గా పనిచేశారు. 2015లో తెలంగాణ రాష్ట్ర భాష, సంస్కృతి & పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2017లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు జరిగిన తెలుగు మహాసభల కోర్ కమిటీ సభ్యుడిగా.. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కాలేజీ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలతో ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత 2024 మార్చి 16న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కార్యదర్శిగా బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
Lagacharla Industrial Park: లగచర్లలో పారిశ్రామిక పార్కు భూసేకరణకు నోటిఫికేషన్..