TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం (నవంబర్ 30) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వక్ఫ్ (సవరణ) బిల్లుపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాయి. తాము జేపీసీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని విపక్ష ఎంపీలు హెచ్చరించారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును పరిశీలించే బాధ్యతను జగదాంబిక పాల్ నేతృత్వంలోని జేపీసీకి అప్పగించిన విషయం తెలిసిందే.
జమిలి ఎన్నికలపై (One Nation One Election) ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Former President Ram Nath Kovind) ఆధ్వర్యంలో భేటీ అయింది.
తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన వారి నుండి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందుకు గాను దరఖాస్తుల నమూనా పత్రాలను www.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. అందులో.. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు ప్రభుత్వ వెబ్-సైట్ లో ఉంచింది. అర్హులైన వారు ఈనెల 18వ తేదీ సాయంత్రం…
ప్రపంచంలోనే ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన మైక్రోసాఫ్ట్ కు కొత్త చైర్మన్‌ను నియమించింది. ఇప్పటి వరకు చైర్మన్‌గా వ్యవహరించిన జాన్ థాంప్సన్ స్థానంలో సత్యనాదెళ్లను నియమించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ అభివృద్దిలో సత్యనాదెళ్ల కీలకపాత్ర పోషించారు. 2014లో ఆయన్ను సీఈవోగా నియమించారు. సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా బాధ్యతలు చెపట్టిన తరువాత ఆ కంపెనీ మరింత వేగంగా అభివృద్ది చెందింది. సీఈవోగా వ్యహరిస్తున్న సత్యనాదెళ్లను చైర్మన్‌గా నియమించేందుకు బోర్డు ఏకగ్రీవంగా అమోదించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇప్పటి…