Revanth Reddy Tweet: ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడని గుర్తుచేశారు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని తెలిపారు. ఒక్క ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామన్నారు. ఇది నెంబర్ కాదు రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం అన్నారు. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా అని సీఎం రేవంత్ ట్విట్ వైరల్‌గా మారింది.
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు…
పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…
పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు.
ఆ ఓటు అభయహస్తమై…
రైతన్న చరిత్రను తిరగరాసింది.ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…
రూ.7,625 కోట్ల రైతు భరోసా…
ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్…
రూ.10,444 కోట్ల ఉచిత…— Revanth Reddy (@revanth_anumula) November 30, 2024
Beerla Ilaiah: గుట్కా తింటూ వంట చేస్తావా.. వంట మనిషిపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆగ్రహం