Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మధ్యాహనం 3.30 గంటలకి డిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు. ఇక, సాయంత్రం కేసీ వేణుగోపాల్ తో సమావేశం కానున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్. అలాగే, డిల్లీకి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు సైతం వెళ్లనున్నారు.
Read Also: Anchor Shyamal: బెట్టింగ్ యాప్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు యాంకర్ శ్యామల
అయితే, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లను అధిష్టానం ఎందుకు పిలిచిందన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. దీంతో పాటు కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది.