కర్ణాటకలో ‘పవర్ షేరింగ్’ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ట్విస్టులు.. మీద ట్విస్టులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ‘బ్రేక్‌ఫాస్ట్’ పాలిటిక్స్ సాగుతున్నాయి. అయితే ఈ అల్పాహారం రాజకీయాల వెనుక చాలా కథనే ఉందని విశ్లేషకులు అంటున్నారు.
కేరళలోని అలెప్పీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఒక విశేషమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఘనంగా సత్కరించారు.
KC Venugopal post about India Flight Emergency Landing: మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (AI2455)లో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి. గుర్తించిన పైలట్ చెన్నైలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల ప్రకారం.. విమానం రెండు గంటలకు పైగా గాలిలో ఉండి.. చివరకు చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం రాత్రి 8 గంటలకు తిరువనంతపురం నుంచి…
CM Revanth Reddy : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో తడబడుతున్న ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అధిష్టానం కీలక నేతలైన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ఆయన సమావేశమై మంత్రుల శాఖలపై చర్చించినట్టు తెలుస్తోంది. Tamil Nadu: అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న…
CM Revanth Reddy : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. అదే విధంగా, ఇవాళ ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశమై విస్తరణపై తుదిరూపురేఖలు ఖరారు చేసే అవకాశముంది. విస్తరణలో భాగంగా ఐదుగురు కొత్తవారికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశంపై పార్టీలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. Maharashtra: మహారాష్ట్రలో…
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మధ్యాహనం 3.30 గంటలకి డిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను కేంద్రం నియమించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు. అయితే జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది.
Telangana Congress: హైదరాబాద్‌లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించనున్నట్లు సమాచారం. రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. ఈ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలతో…
కేరళ మినీ పాకిస్థాన్ అంటూ మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. నితీష్ రాణేపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో వయో భారంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలిపారు. ఆర్థిక వేత్తగా మన్మోహన్ అనుసరించిన విధానాలను నేతలు గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ప్రముఖులు నివాళులర్పించారు.