హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్డు నం. 41 లోని ఓ హోటల్ ఓయో రూంపై దాడులు చేసి ముగ్గులు సెక్స్ వర్కర్లను, ఇద్దరు విటులు, ఒక నిర్వహకుడిని పొలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారంతో పోలీసులు పక్కా ప్లాన్ వేసి..ఓయో రూంపై దాడులు చేశారు. వ్యభిచార గృహ నిర్వహకుడిని అశ్విన్ గా గుర్తించారు. విటులను అల్వాల్ కు చెందిన వ్యాపారి రాహుల్ సురాన, కూకట్ పల్లి నిజాంపేటకు చెందిన వెంకట అప్పయ్యలుగా గుర్తించారు. సెక్స్ వర్కర్లుగా పని చేస్తున్న యువతులను గుజరాత్ లోని వడదోర, మహారాష్ట్ర లకు చెందిన వారీగా గుర్తించారు. సెక్స్ వర్కర్లను ప్రభుత్వ షెల్టర్ హోమ్ కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.