మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడును అంటారు పెద్దలు. అప్పటి వరకు రోహిణి కార్తెల కారణంగా మండిన ఎండలకు ప్రజలు విలవిలలాడిపోతారు. మృగశిర కార్తె మొదలవ్వగానే వాతావరణం చల్లబడుతుంది. అంతవరకు ఉన్న వేసవి తాపం తీరిపోతుంది. వాతావరణం మారడంతో శరీరం ఆ మార్పులను గ్రహించి సర్దుకోవడానికి సమయం పడుతుంది. ఇలా చల్లబడిన వాతావరణం వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగాలు ఉన్న వాళ్లు ఇబ్బంది పడతారు. మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జ్వరం, జలుబు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే…
ప్రతి ఏడాగి మృగశిర కార్తె రోజున హైదరాబాద్ చేప మందు ప్రసాదం పంపిణీ జరుగుతుంది. కానీ, కరోనా కారణంగా చేప మందు ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. జులై 8 వ తేదీన చేపమందు పంపిణీ చేయడం లేదని ఇప్పటికే బత్తిన సోదరులు ప్రకటించారు. మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు తీసుకోవడం వలన ఆస్తమా నుంచి ఉపశమనం పోందవచ్చనే ప్రచారం జరగడంతో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రామ్‌నగర్ చేపల మార్కెట్‌కు చేరుకున్నారు. ఒక్కసారిగా…