Forest officials: అటవీశాఖ అధికారులకు సర్కార్ గుడ్ న్యూస్.. వారికి రూ.కోటి వరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forest officials: అటవీ రక్షణలో భాగంగా విధి నిర్వహణలో అసాంఘిక శక్తుల దాడుల్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరణిస్తే భారీ పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో సహా, చాలా రాష్ట్రాల్లో అసాంఘిక దాడుల్లో అటవీశాఖ సిబ్బంది మరణిస్తే అందని పరిహారం అందించేందుకు సిద్దమైంది. తొలి సారి తెలంగాణ ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం ప్రకటించడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Netherlands Train Accident : నెదర్లాండ్స్ లో ఘోర రైలు ప్రమాదం
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
అటవీ శాఖ ఉద్యోగులు చాలా మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి అటవీ ప్రాంతాన్ని కాపాడుతున్నారు. విధి నిర్వహణలో అనేక దాడులను ఎదుర్కోవాల్సిన క్రమంలో సంఘవ్యతిరేక శక్తులు, తీవ్రవాదుల చేతుల్లో కొంత మంది చనిపోతున్నారు. కొందరు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగినప్పటికీ, వారు తీవ్రంగా గాయపడి తమ విధులకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు తలెత్తు తున్నాయి. అలాంటి వారిని, వారి కుటుంబాలను ఆదుకునేందుకు కేసీఆర్ సర్కార్ గట్టి నిర్ణయమే తీసుకుంది. విధి నిర్వహణలో భాగంగా ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతిలో మృతి చెందే అటవీశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నష్టపరిహారం ప్రకటించింది. ర్యాంక్ వారీగా అధికారులకు రూ. 30 లక్షల నుంచి రూ. కోటి మేరకు పరిహారం అందించనుంది. ఈమేరకు తాజాగా జీవో విడుదల చేసింది. కేటగిరీల వారీగా పరిహారం నిర్ణయించబడింది. అటవీ పరిరక్షణలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో మరణించిన బీట్ ఆఫీసర్ తత్సమాన స్థాయి ఉద్యోగులకు రూ. 30 లక్షలు, పనికి శాశ్వతంగా గైర్హాజరైతే రూ. 20 లక్షలు, తీవ్ర గాయం అయితే రూ. 3 లక్షల పరిహారం ప్రకటించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ అధికారి మరణిస్తే రూ. 45 లక్షలు, పనికి శాశ్వతంగా గైర్హాజరైతే రూ. 25 లక్షలు, తీవ్ర గాయాలు అయితే రూ. 5 లక్షలు, అటవీ రేంజ్ అధికారులు చనిపోతే రూ. 50 లక్షలు, శాశ్వతంగా అసమర్థులైతే రూ. 30 లక్షలు, తీవ్ర గాయమైతే రూ. 5 లక్షలు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్థాయి ఉద్యోగులు మరణిస్తే రూ. 75 లక్షలు, డ్యూటీకి శాశ్వతంగా గైర్హాజరైతే రూ. 40 లక్షలు, తీవ్ర గాయమైతే రూ. 5 లక్షలు, ఐఎఫ్ఎస్ అధికారులు దాడుల కారణంగా విధి నిర్వహణలో మరణిస్తే రూ. కోటి, అసమర్థ గాయం అయితే రూ. 50 లక్షలు, తీవ్ర గాయాలు అయితే రూ. 6 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు.
Vallabhaneni Vamsi: సీఎం జగన్ సమీక్షకు డుమ్మా..! వల్లభనేని వంశీ స్పందన ఇదే..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!