Deputy CM Pawan Kalyan: మన అందరి ప్రథమ బాధ్యత అడవులను కాపాడటం.. దాని కోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విజయవాడలో రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారుల వర్క్ షాపులో పాల్గొన్న పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నేను చాలా ఇష్టంతో ఎంచుకున్నవి పర్యావరణం, అటవీ శాఖలు అన్నారు. ఒక వ్యవస్థ నడవాలి అన్నా.. ఒక సంస్థ ముందుకు వెళ్ళాలి…
తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు.. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.. రాత్రి శిఖరం చెక్ పోస్ట్ దగ్గర తన వాహనాన్ని ఆపి హంగామా చేశారని.. శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటున్నారు ఫారెస్ట్ బీట్ సిబ్బంది.
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు అటవీ శాఖ అధికారులు. రేపటి నుంచి(జూలై 01 2025) ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను నిలిపివేశారు. రేపటి నుంచి సెప్టెంబర్ 31 2025 వరకు ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను నిలిపేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అటవీ శాఖ వారు భద్రతా కారణాలు, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇష్టకామేశ్వరి ఆలయం శ్రీశైలం నల్లమల అడవులలో ఉంది. భక్తులు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం కోసం ఈ…
జూన్2 న భూమి లేని నిరుపేద రైతులు ఎవరైతే అసైన్డ్ భూములను సేద్యం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అధికారులతో జరిగిన సమావేశంలో పొంగులేటి కీలక సూచనలు చేశారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కావద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని తెలిపారు.
అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన శిక్షణను బలోపేతం చేసే దిశగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. అటవీ శాఖ ఉద్యోగులు అటవీ, వన్య ప్రాణి సంరక్షణపై లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులకు సూచించారు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మహదేవపూర్ మండలంలోని ఏన్కపల్లి అడవుల నుంచి ప్రతాపగిరి అడవుల వైపు పెద్దపులి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో జరిగిన ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్, టీడీపీ నేత రాకేష్ చౌదరి చనిపోయారు. పంటపొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తుండటంతో.. వాటిని తరిమేందుకు రాకేష్ వెళ్లగా అవి తిరగబడ్డాయి. ఓ ఏనుగు దాడి చేయడంతో 33 ఏళ్ల రాకేష్ చౌదరి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏనుగు తొండంతో చెట్ల కేసి కొట్టి.. ఆపై నేలపై వేసి కాలితో తొక్కడంతో మృతి చెందారు. ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతితో ఫారెస్ట్ అధికారులు…
Attack on Officials: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్టణం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారులు అక్రమ కలప నిల్వలపై సమాచారంతో కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహించిన సమయంలో గ్రామస్తుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అధికారులపై గ్రామస్తులు దాడి చేయడంతోపాటు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఓ బీట్ ఆఫీసర్‌కు గాయాలు కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. అటవీశాఖ అధికారులు గ్రామంలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కలప దుంగలు, ఫర్నీచర్…
Leopard attack: తమిళనాడు రాష్ట్రం వెలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామంలో ఒక విషాదకరమైన ఘటన జరిగింది. వంట కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన 20 ఏళ్ల అంజలీ అనే యువతి చిరుతపులి దాడికి గురైంది. అంజలీ కట్టెలు తీసుకొని ఇంటి వైపు వస్తుండగా, చిరుతపులి ఆమెపై దాడి చేసి ఆమెను గొంతు పట్టుకొని అడవిలోకి తీసుకెళ్లి హతమార్చింది. ఈ ఘటనపై గ్రామస్థులు ఆందోళన చెందారు. కట్టెల కోసం ఉదయం బయలు దేరిన అమ్మాయి సాయంత్రం వరకు…
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సమీపంలో నల్లమల ఫారెస్ట్‌లో భక్తులు తప్పిపోవడం కలకలం సృష్టించింది.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలో శ్రీశైలం సమీపంలోని ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయానికి వెళ్తూ.. తప్పిపోయారు 15 మంది భక్తులు.. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి సురక్షితంగా రక్షించి అటవీప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చారు..