పాకాల మండల పరిధిలో ఉన్న అటవీప్రాంతంలో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. అటవీప్రాంతంలో డెడ్ బాడీలు దొరకడంతో వారిని ఎందుకు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విషయమై పాకాల పోలీసులు తంజావూరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికి ఒక మహిళ, పురుషుడి డెడ్ బాడలకు పోస్టుమార్టం చేయగా.. వారి నోటిలో గుడ్డలు, గ్లౌజులు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లుగా తెలిసిందని పోలీసులు తెలిపారు. వారిలో మృతుడు తంజావూర్ కు చెందిన కలై…
చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ఏర్పాటు చేసిన అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ విచారణ ప్రారంభించింది.. కమిటీలో సభ్యులైన చిత్తూరు కలెక్టర్ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి ఆక్రమించారని భావిస్తున్న 295, 296 సర్వే నెంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్త్రాలను పరిశీలించారు.
Tiger Search Operation: కొమురం భీం జిల్లా అడవుల్లో పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసిన పులి.. బెబ్బులి భయంతో పంట చెన్ల వైపుకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఇటిక్యాల పహాడ్, దుబ్బగూడ శివారు ప్రాంతాల వైపు వెళ్లాలంటేనే అన్నదాతలు జంకుతున్నారు.
Pawan Kalyan: ప్రకృతిని పరమేశ్వరి ప్రతిరూపంగా ఆరాధించడం భారతీయ సనాతన ధర్మంలో ఒక గొప్ప ఆచారం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి ప్రకృతిలో ఆకృతి తొడిగే పుష్పాలను బతుకమ్మలుగా పూజించడం తెలంగాణ ఆడపడుచుల సంప్రదాయం.. దేవి నవరాత్రులతో ఆరంభమయ్యే బతుకమ్మల పూజలు, ఆటలు నేటి సద్దుల బతుకమ్మతో ముగియనున్న తరుణంలో నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భక్తిపూర్వక శుభాకాంక్షలు అని జనసేన అధినేత పేర్కొన్నారు.
ఆ రాబందు.. చూడటానికి సాధారణంగానే ఉంది. కానీ.. దాని కాళ్లకు మాత్రం జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరా అమర్చారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని.. బాగా అలసిపోయింది ఆ రాబందు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఏటూరు గ్రామ సమీపంలో కారులో అటవీ జంతువు మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. అటవీ జంతువు ఉన్న కారు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Uttarakhand : రాష్ట్రంలోని జనావాస ప్రాంతాలకు మంటలు చెలరేగడంతో పాఠశాలలు, కళాశాలలు కూడా ప్రమాదంలో పడ్డాయి. చాలా ప్రభుత్వ పాఠశాలలు నదీ తీరాలు, అడవులకు సమీపంలో ఉన్నాయి.
ప్రస్తుతం అంతర్జాలం అందరికీ అందుబాటులో ఉండడం కారణంగా.. ప్రపంచం మొత్తంలో ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా ద్వారా అందరికీ ఇట్లే తెలిసిపోతుంది. ఇందులో ముఖ్యంగా ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపచేసేలా ఉంటాయి. మరికొన్ని భయభ్రాంతులకు లోనయ్యే విధంగా కూడా ఉంటాయి. ఇకపోతే తాజాగా ఎలుగుబంటి, పెద్దపులికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.…