Vallabhaneni Vamsi: సీఎం జగన్ సమీక్షకు డుమ్మా..! వల్లభనేని వంశీ స్పందన ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వేదికగా మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. మరోసారి మనం అధికారంలోకి రాకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని.. అంతా కలిసికట్టుగా పనిచేస్తే.. అను లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు.. ఇక, ఏ ఒక్క ఎమ్మెల్యేను గానీ, ఏ ఒక్క కార్యకర్తను గానీ నేను వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.. అయితే, ఈ సమావేశానికి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.. అందులో ఒకరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. దీనిపై ఎన్టీవీ ఆయనను సంప్రదించింది.. నిన్న జరిగిన సీఎం సమీక్షకు గైర్హజరుపై స్పందించిన ఎమ్మెల్యే వంశీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కోర్సు చేస్తున్న.. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో హాజరుకాలేదన్నారు.
Read Also: Prabhas: అన్నపూర్ణ స్టూడియోలో టెర్రస్ ఎక్కిన పాన్ ఇండియా స్టార్
Also Read
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ఇక, నేను, కొడాలి నాని పార్టీ మారుతున్నాం అంటూ ప్రచారాలు వచ్చాయి.. అవి మెరుపు కలలు మాత్రమే.. అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు వల్లభనేని వంశీ.. ఎన్నికలు పరోక్ష, ప్రత్యక్ష ఎన్నికలు ఉంటాయి.. పరోక్ష ఎన్నికల్లో ఎప్పుడూ వైసీపీ పోటీ పడలేదు.. అందుకనే టీడీపీకి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు గెలుచుకుందన్నారు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికల్లో 19 ఓట్లు ఉన్నాయి.. అయినా టీడీపీ అభ్యర్థులు గెలిచారు అంటే ఆర్థిక అంశాలే అని విమర్శించారు. ఆ ప్రలోభాల్లో తెలంగాణలో జరిగిన ఘటన పునరావృతం కాకపోవడం చంద్రబాబు నాయుడు అదృష్టంగా పేర్కొన్నారు. టీడీపీ నాయకుల నుండి డబ్బులు ఖర్చు పెట్టించేందుకే ముందస్తు ఎన్నికలు అంటూ గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు మాతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టచ్‌లో ఉన్నారంటూ గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు.. ఇది మైండ్ గేమ్ మాత్రమే అంటూ మండిపడ్డారు వంశీ… అంతిమంగా ఓట్లు వేసి గెలిపించేది ఓటర్లు మాత్రమే అన్నారు. చంద్రబాబు నాయుడుని చూసి ఓట్లు వేయని వారు.. నారా లోకేష్ సుందర మోకారవిందాని చూసి ఓట్లు వేస్తారా ? అంటూ ఎద్దేవా చేశారు వల్లభనేని వంశీ. కాగా, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత టీడీపీనికి రాజీనామా చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!