Bandi sanjay: బండి సంజయ్ పిటిషన్ విచారణ ఈనెల 10 కి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi sanjay: బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హనుమకొండ కోర్టు డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్టు సమయంలో పోలీసులు 41ఎ నోటీసు జారీ చేయలేదని పేర్కొన్నారు. హైకోర్టులో రిమాండ్ క్వాష్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి(10)న వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో బండి సంజయ్‌పై వచ్చిన ఆరోపణలపై హైకోర్టు ప్రశ్నించింది. పేపర్ పబ్లిక్ డొమైన్‌లో ఉంటే లీకేజీ ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. కింది కోర్టులో పెండింగ్‌లో ఉన్న బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. త్వరలో బండి సంజయ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నందున ఇవాళే హనుమకొండ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు లాయర్ రామ్ చందర్ రావు. బెయిల్ పిటిషన్ విచారణను ఇవాళే ముగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎల్లుండి ప్రధాని పర్యటన ఉందన్న నేపథ్యంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బండి సంజయ్ వాట్సప్ లో సర్కులేట్ చేశాడే తప్ప లీకేజీలో అతని ప్రమేయం ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయ నాయకుడిగా బండి సంజాయ్ పేపర్ బయటకు వచ్చాక సర్కులేట్ చేయడం తప్పేంటి హైకోర్టు ప్రశ్నించింది.
Also Read
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
Read also: Vidadala Rajini: నా రాజకీయ భవిష్యత్ జగన్ పెట్టిన భిక్షే.. మంత్రి భావోద్వేగం
లంచ్ మోషన్‌లోని కీలక అంశాలు:
> హనుమకొండ కోర్టు జారీ చేసిన డాకెట్‌ను సస్పెండ్ చేయాలి
> సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి
> అరెస్టు సమయంలో పోలీసులు 41-ఎ నోటీసు జారీ చేయలేదు
> అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు
> కరీంనగర్ కు 150 కి.మీ దూరంలో ఉన్న బొమ్మలరామారంకు తరలించారు
> బొమ్మలరామారావుకు ఎందుకు తరలించారో తెలియదు.
> గతంలో ఇదే బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేశారు
> రాత్రంతా పీఎస్‌లో అక్రమంగా నిర్బంధించారు
> వైద్య పరీక్షల నిమిత్తం బొమ్మలరామారం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
> మళ్లీ పాలకుర్తి నుంచి హన్మకొండకు తరలించారు
> కరీంనగర్ నుండి వరంగల్ కేవలం 60 కి.మీ
> వారు వేధింపులకు గురిచేయడానికి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించారు
> వరంగల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు
> బీజేపీపై కుట్రలో భాగంగానే ఆయనను ఈ కేసులో ఇరికించారు
> రిమాండ్ రిపోర్టులో కూడా నేరం ప్రస్తావన లేదు
> అరెస్టు సమయంలో పోలీసులు CrPC 50ని అనుసరించలేదు
> పోలీసు కస్టడీలో కూడా దురుసుగా ప్రవర్తించారు
> సంజయ్ ని నిన్న రాత్రి అరెస్టు చేసి, నిన్న సాయంత్రం 6:02 గంటలకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు
> పోలీసులు బీఆర్‌ఎస్ పార్టీ చెప్పినట్లు వ్యవహరిస్తున్నారు
> హనుమకొండ కోర్టు ఇచ్చిన డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలి
Indian Railways : ఈ వార్త వింటే మీరు రైలు లేటైతే బాగుండు అంటారు
తాజావార్తలు
-
Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!
-
UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!