Spain Wins FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనాపై 1-0 తేడాతో చారిత్రాత్మక విజయం
- స్పెయిన్ ఫిఫా వరల్డ్ కప్‌ను రెండోసారి కైవసం
- అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి ప్రపంచ విజేతగా
- ఫెర్రాన్ టొరెస్ చేసిన ఏకైక గోల్ స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పెయిన్ ఫిఫా వరల్డ్ కప్‌ను రెండోసారి కైవసం చేసుకుంది. సోమవారం ఉదయం న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది. అదనపు సమయంలో 106వ నిమిషంలో ఫెర్రాన్ టొరెస్ చేసిన ఏకైక గోల్ స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
అదనపు సమయంలో నిర్ణయాత్మక గోల్
మ్యాచ్ మొత్తం గోల్ కోసం ఎదురుచూసిన అభిమానులకు అదనపు సమయంలో ఫెర్రాన్ టొరెస్ ఆనందాన్ని పంచాడు. నికో విలియమ్స్ అందించిన అద్భుతమైన అవకాశాన్ని టొరెస్ దగ్గర నుంచి గోల్‌గా మలిచాడు. దీంతో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లి చివరి వరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంది.
Also Read
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
10 మందితో పోరాడిన అర్జెంటీనా
నిర్ణీత సమయంలో చివరి క్షణాల్లో అర్జెంటీనా స్టార్ మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ రెండో యెల్లో కార్డు కారణంగా రెడ్ కార్డు అందుకున్నాడు. దీంతో అదనపు సమయాన్ని అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చింది. ఆ లోటు చివరికి జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది.
స్పెయిన్ ఆధిపత్యం
మ్యాచ్ ప్రారంభం నుంచే స్పెయిన్ బంతిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలోనే 60 శాతం కంటే ఎక్కువ బంతిని తమ ఆధీనంలో ఉంచింది. మరోవైపు అర్జెంటీనా మొత్తం మ్యాచ్‌లో ఒక్కసారి కూడా లక్ష్యంపై షాట్ నమోదు చేయలేకపోయింది. స్పెయిన్ వరుస దాడులతో ఒత్తిడి పెంచినా, అర్జెంటీనా రక్షణ గోడలా నిలిచింది.
ఎమిలియానో మార్టినెజ్ అద్భుత ప్రదర్శన
అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 11 కీలక సేవ్‌లు చేసి జట్టును చాలా సేపు పోటీలో నిలబెట్టాడు. మార్క్ కుకురెల్లా, లామిన్ యమాల్, నికో విలియమ్స్, పెడ్రి, పౌ కుబార్సీ చేసిన ప్రమాదకర ప్రయత్నాలను అడ్డుకుని స్పెయిన్‌ను నిరాశపరిచాడు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఒక గోల్‌కీపర్ చేసిన అత్యధిక సేవ్లలో ఇది ఒకటిగా నిలిచింది.
రద్దైన గోల్.. చివరకు విజయగోల్
96వ నిమిషంలో నికో విలియమ్స్ గోల్ చేసినప్పటికీ, బిల్డ్అప్లో ఫౌల్ జరిగినట్లు గుర్తించి రిఫరీ ఆ గోల్‌ను రద్దు చేశాడు. అయినప్పటికీ స్పెయిన్ వెనక్కి తగ్గకుండా దాడులు కొనసాగించింది. మికెల్ మెరినోకు వచ్చిన మంచి అవకాశం చేజారినా, చివరకు విలియమ్స్ సృష్టించిన అవకాశాన్ని ఫెర్రాన్ టొరెస్ గోల్‌గా మలిచి జట్టుకు ప్రపంచ కప్ అందించాడు.
మెస్సీకి నిరాశ
అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ఈ ఫైనల్లో పెద్దగా అవకాశాలు లభించలేదు. స్పెయిన్ రక్షణ అతడిని సమర్థంగా కట్టడి చేసింది. అర్జెంటీనా దాడి విభాగం ప్రభావం చూపలేకపోవడంతో, మెస్సీ కూడా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. మ్యాచ్ సాగేకొద్దీ మెస్సీ మినహా మిగతా అటాకింగ్ ప్లేయర్స్ ను మార్చి డిఫెన్సివ్ ప్లేయర్స్ ను రంగంలోకి దింపడం అర్జెంటీనా వ్యూహాన్ని స్పష్టం చేసింది.
16 ఏళ్ల నిరీక్షణకు తెర
2010లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మళ్లీ టైటిల్ కోసం 16 సంవత్సరాలు ఎదురుచూసిన స్పెయిన్, ఇప్పుడు రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు వరుసగా రెండోసారి ట్రోఫీని నిలబెట్టుకోవాలన్న అర్జెంటీనా ఆశలు ఈ ఓటమితో ముగిశాయి.
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!