తెలంగాణలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. థర్డ్ వేవ్ కారణంగా 60 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. అయితే, 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లాలి అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అంతదూరం వెళ్లి క్యూలైన్లో నిలబడి వ్యాక్సిన్ తీసుకోవాలంటే అయ్యేపనికాదు. వీరికోసం జీహెచ్ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే డైరెక్ట్‌గా వారి ఇంటికి వచ్చి బూస్టర్ డోసు వేస్తామని ప్రకటించింది. దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారు 04021111111 నెంబర్‌కు ఫోన్ చేయాలని, ఫోన్ చేసి వివరాలు చెబితే ఇంటికి వచ్చి వ్యాక్సిన్ అందిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.