హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలకు జీహెచ్‌ఎంసీ చలానాలు జారీ చేస్తోంది. కొద్దిరోజుల ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ‘సాలు దొరా.. సెలవు దొరా’అంటూ పెట్టిన డిజిటల్ డిస్‌ప్లే బోర్డుకు రూ.50 వేలు, ప్రధాని మోదీ– బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలతో ఉన్న బ్యానర్, కటౌట్‌లకు రూ.5 వేలు కలిపి రూ.55 వేల జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లపై పౌరుల ఫిర్యాదు మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట ఈ–చలానాలు జారీ చేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ పేర్కొంది.
ఇక ట్విట్టర్ వేదికగా వస్తున్న ఫిర్యాదులకు అనుగుణంగా కూడా జీహెచ్‌ఎంసీ చలానాలు జారీ చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఫ్లెక్సీలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం వరకు హైటెక్‌సిటీ, అబిడ్స్, బంజారాహిల్స్, మాదాపూర్, బేగంపేట తదితర ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలు, హోర్డింగులకు దాదాపు రూ. 3.50 లక్షల పెనాల్టీలతో ఈ–చలానాలు జారీ అయినట్టు తెలిసింది. హైటెక్ సిటీలో బండ కార్తీకచంద్రారెడ్డి పేరిట వెలిసిన హోర్డింగ్‌కు రూ.లక్ష చలానా వేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి పేరిట ఎక్కువ చలానాలు జారీ అయ్యాయి.
నగంరలోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ‘సాలు దొర.. సెలవు దొర’అంటూ డిజిటల్ కౌంట్ డౌన్‌తో బీజేపీ డిస్ ప్లే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టింది. అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పెట్టిన డిజిటల్ డిస్ ప్లే బోర్డును అనుమతి లేదంటూ అధికారులు తొలగించారు. అయితే ఈ నేపథ్యంలో.. బీజేపీ ప్రచారాన్ని, విమర్శలను తిప్పికొట్టేలా టీఆర్‌ఎస్ నేతలు సాలు మోదీ.. సంపకు మోదీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు జిల్లాల్లో వెలసిన విషయం తెలిసిందే.. అయితే.. టీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ట్వీట్ వేదికగా విమర్శలు గుప్తించారు. ఎనిమిదేళ్లలో మీ పథకాలు ఎంత మందిని చంపాయో కౌంట్ చేద్దామా తరుణ్ చుగ్ ’అని ఎద్దేవా చేశారు.
Sanjay Raut: శివసేన అధికారం కోసం పుట్టలేదు.. అధికారమే శివసేన కోసం పుట్టింది