వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో నవ్వులు పూయించారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాలోని ‘గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం’ అనే డైలాగ్ చెప్పి రిపోర్టులను కాసేపు నవ్వించారు. పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినా తప్పేనా?.. పుష్ప మాదిరి గడ్డం అన్నా తప్పే.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా?, లేదా? అని జగన్ ప్రశ్నించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైఎస్ జగన్…
మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు మంత్రి కందుల దుర్గేష్.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ కు గురై మృతి చెందిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీ కడుతూ వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ అనే నలుగురు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.…
ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.. విగ్రహావిష్కరణ ఇప్పటికే వివాదాస్పదం కాగా.. విగ్రహావిష్కరణ రోజునే విషాదం మిగిల్చింది. విద్యుత్ షాక్ నలుగురిని విగత జీవులుగా మార్చింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది..
జగిత్యాలలో ఉండనిస్తారా వెళ్లగొడతారా అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి ఫొటో ఉన్న ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఫొటో ఉండడంతో స్థానిక కౌన్సిలర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. స్పందించిన అధికారులు ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయం తెలియని జీవన్ రెడ్డి అసహనంతో ఉండమంటారా వెళ్లగొడతారా అంటూ మండిపడ్డారు.
చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో ప్రజలంతా ఒకే నిర్ణయం తీసుకొని.. గ్రామ అభివృద్ధికి సహకరిస్తుంటారు. గతంలో పలుమార్లు ఈ గ్రామంలో ఎన్నికలు లేకుండా సర్పంచులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీతో పాటు, లోక్‌సభ ఎన్నికలు రావడంతో తాము ఓట్లు అమ్ముకోబోమంటూ.. గ్రామస్తులు.. ఊరంతా వేసిన గోడపత్రాలు.. ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి.
ఎన్నికల తరుణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ గ్రామంలో స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. జనసేన పార్టీ అభ్యర్థి గానీ, నాయకులు గానీ.. మా గ్రామంలోకి రావొద్దు అని హెచ్చరిస్తూ మాగపువారిపేట గ్రామస్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం మాగపువారిపేటలో ఈ వార్నింగ్ ఫ్లెక్సీలు కలకలం రేపుపుతున్నాయి.
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు కలకలం సృష్టించింది. ‘పోరంబోకు భూమి కాపాడు జగనన్న’ అంటూ చల్లా అచ్చిరెడ్డి పేరుతో నల్లపాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. నేడు సీఎం జగన్ నల్లపాడు రానున్నారు. Also Read: Top Headlines@9AM: టాప్ న్యూస్! ‘ఆడుదాం…
TDP Flag: ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యం.. కల్తీ ఆహారం.. మారిన తిండి అలవాట్లతో.. మనిషి జీవన ప్రమాణ స్థాయి క్షీణించింది. అరవై ఏళ్లు బతికామంటేనే గొప్ప అనుకునే రోజులొచ్చాయంటే నమ్మశక్యం కాదు. కానీ ఓ వృద్ధుడు 80 ఏళ్ల వయసులోనూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. అక్కడ టీడీపీ జెండా ఎగరవేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గింజుపల్లి శివప్రసాద్ అనే వృద్ధుడు ఎవరెస్ట్ శిఖరాన్ని 5000 మీటర్ల ఎత్తు…