హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలకు జీహెచ్‌ఎంసీ చలానాలు జారీ చేస్తోంది. కొద్దిరోజుల ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ‘సాలు దొరా.. సెలవు దొరా’అంటూ పెట్టిన డిజిటల్ డిస్‌ప్లే బోర్డుకు రూ.50 వేలు, ప్రధాని మోదీ– బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలతో ఉన్న బ్యానర్, కటౌట్‌లకు రూ.5 వేలు కలిపి రూ.55 వేల జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లపై పౌరుల ఫిర్యాదు…