Jiyaguda Case Twist: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడలో ఆదివారం నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈఘటనను సవాల్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు చేధించారు. సాయినాధుని చంపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయినాథ్ ముగ్గురు స్నేహితులే నరికి చంపినట్లుగా గుర్తించారు. ఆర్థిక కారణాలతోనే సాయినాధుని చంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. నిన్న నడిరోడ్డు పైన అందరు చూస్తుండగానే సాయినాధుని నరికి చెప్పిన నిందితులు అక్షయ్, టిల్లు, సోను హత్య చేసినట్లగా గుర్తించారు. వారిని పక్కాప్లాన్‌తో అదుపులో తీసుకున్నారు.
Read also: KTR: ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానం
హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడలో కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు జంగం సాయినాథ్ నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం పని నిమిత్తం టూ వీలర్ పై పురానాపూల్ నుంచి జియాగూడ మేకలమండి దగ్గరినుంచి జంగం సాయినాథ్ బయలు దేరాడు. అయితే.. ఈ క్రమంలోనే పీలి మండవ్ శివాలయం సమీపంలోకి సాయినాథ్ చేరుకోగానే ముగ్గురు ఆగంతకులు ఒక్కసారిగా అతడి వాహనానికి అడ్డుగా వచ్చారు. కళ్లు తెరిచి చూసేలోగా అతనిపై దాడికి దిగారు. ఒకరు ఇనుపరాడ్డుతో సాయినాథ్ తల వెనుక బలంగా కొట్టాడు. దీంతో సాయినాథ్ బండి మీద నుంచి కింద పడిపోయాడు. అనంతరం కొడవలి, కత్తి, ఇనుపరాడ్లతో ముగ్గురు మూకుమ్మడిగా అతడి మీద దాడి చేశారు. సాయి నాథ్ సహాయం కోసం గట్టిగా కేకలు వేశాడు. కాగా సాయినాథ్ ను కత్తులతో ముఖం, చేతులు, కాళ్లు, పొట్ట భాగంలో విచక్షణారహితంగా నరికారు. ఈ సమయంలో గోషామహల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ జనార్ధన్ పురాణా పూల్ వైపు నుంచి టూవీలర్ పై వస్తున్నాడు. ఆవ్యక్తి అతను ఈ దారుణాన్ని దూరం నుండే గమనించి.. కేకలు వేయడంతో గమనించిన నిందితులు మూసీ నదిలోకి వెళ్లే మెట్ల మార్గం నుంచి దూకి ఘటనా స్థలం నుంచి పారిపోయారు. అంత జరుగుతున్న ఎవరు పట్టించుకోలేదు అందరూ తమ సెల్ ఫోన్ లో ఆఘటనను చిత్రీకరించే తప్పా సాయినాథ్‌కు కిరాతకంగా చంపుతున్న ఆదుకోవాలని అనిపించలేదు. మనకెందుకు అనుకున్నారో ఏమో మళ్లీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీని మీద పోలీసు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకోవడానికి భయమైతే డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేసినా ఓ ప్రాణం నిలిచేదని వారు అన్నారు.
IAS Officer Case Update: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంటికి.. డిప్యూటీ తహశీల్దార్ పై వేటు