KTR: ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అమెజాన్ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచంలో హైదర్ బాద్ లో అమెజాన్ కు అతి పెద్ద క్యాంపస్ ఉంటుందన్నారు. అమెజాన్ అతి పెద్ద క్యాంపస్ సియోటెల్ లో కాదు హైదరాబాద్ లో ఉందని హర్షం వ్యక్తం చేశారు కేసీఆర్. అమెజాన్ హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెడుతుందని అది ఇకనుంచి కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్ లో ఇవాళ అమెజాన్ ఎయిర్ స్టార్ట్ చేశామని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో తెలంగాణ అత్యంత వేగంగా అభవృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి. హైదరాబాద్ కు గడిచిన ఎనిమిది ఏళ్లుగా భారీగా పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అమెజాన్ బృందాన్ని అభినందించారు. అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ అని.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని చెప్పారు. అంతేకాకుండా.. ఏవియేషన్ రంగంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్ అని చెప్పారు. అంతేకాకుండా.. హైదరాబాద్ గ్రీన్‌సిటీ అవార్డును సొంతం చేసుకున్నదని తెలిపారు.
Read also: Kishan Reddy: అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. ఫోన్ చేసి..
రెండు రోజుల క్రితమే దావూస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ ఇవాళ అమెజాన్ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన పారిశ్రామిక వేత్తలతో బిజీగా గడిపారు. పలు పరిశ్రమలు తెలంగాణకు వచ్చేలా చేయడంలో ఆయన సఫలమయ్యారు. మంత్రి కేటీఆర్ నాలుగు రోజుల పర్యటనలో రాష్ట్రానికి 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా చర్చలు జరిగినట్లు తెలిసింది. మంత్రి కేటీఆర్ ఈ 4 రోజుల్లో 52 వ్యాపార సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు నిర్వహించారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రూ.16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో 2 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు దావోస్ వేదికగా ప్రకటించింది. 2 వేల కోట్ల రూపాయలతో ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ డేటాసెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటుచేస్తున్నట్లు భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేంద్రంగా భారతీయ మార్కెట్‌లో విస్తరిస్తామని ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత ఔషధ పరిశోధన, తయారీ సంస్థ యూరోఫిన్స్ ప్రకటించింది. లండన్ తరువాత హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను అపోలో టైర్స్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.
IAS Officer Case Update: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంటికి.. డిప్యూటీ తహశీల్దార్ పై వేటు