Etela Rajender Fires On CM KCR: మాటలు కోటలు దాటుతాయి, కానీ కాళ్లు మాత్రం తంగేళ్ళు దాటవు అంటూ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తారాస్థాయిలో ధ్వజమెత్తారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర నాయకులను టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్య అంటూ చెప్పారని.. ఈనాడు టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్య అంటూ చేసేది కేసీఆర్ అని విమర్శించారు. మెదక్ జిల్లాలోని బాలాజీ గార్డెన్స్‌లో నిర్వహించిన మహాజన్ సంపర్క్ సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. అప్పట్లో తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ పోరాడినప్పుడు మెదక్ జిల్లా పులకరించిపోయిందని, కానీ ఇప్పుడాయన ముఖ్యమంత్రి అయ్యాక ‘ఈయన్నా మనం ఓట్లేసి గెలిపించింది’ అని అనిపిస్తోందని పేర్కొన్నారు.
Balka Suman: కాంగ్రెస్‌కు ఓటేస్తే చంద్రబాబుకి వేసినట్టే.. బాల్క సుమన్ ఫైర్
ఆనాడు ఉద్యమంలో కేసీఆర్‌ని ఎవరైనా ఏమైనా అంటే యువత ఫైర్ అయ్యేదని.. నేడు అదే యువత ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని ఈటల వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యూహం, బలం, బలహీనతలన్నీ ఈటలకు తెలుసని చాలామంది అంటున్నారని.. మీ దెబ్బ పడితే దిమ్మతిరగాలి అని చెప్తున్నారని.. చాలామంది తనలాంటి వాళ్లను ప్రోత్సాహిస్తున్నారని చెప్పారు. మీ అందరి ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ని తప్పకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే దుబ్బాకలో రఘునందన్‌ని గెలిపించారని, హుజూరాబాద్‌లో బీజేపీని ఆశీర్వదించారని.. రాబోయే ఎలక్షన్లలోనూ మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదన్నారు. అయితే.. ఇప్పుడు వాతావరణం మారిపోయిందని, కాంగ్రెస్ బలపడిందని అంటున్నారని పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్ ఎక్కడ బలపడిందని ప్రశ్నించారు.
Salaar: చంపేస్తే చంపేయండయ్యా.. లేదంటే.. ఈ హైప్ తోనే పోయేలా ఉన్నాం
BRS పార్టీని, జిత్తులమారి కేసీఆర్‌ని ఓడించే సత్తా ఒక్క బీజేపీకే ఉందని ఈటల ఉద్ఘాటించారు. అప్‌కి బార్ కిసాన్ సర్కార్ అంటూ కేసీఆర్ పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్నాడని.. మరి, వడగళ్ల వానతో నష్టపోయిన తెలంగాణ కౌలు రైతులను అదుకున్నారా? అని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో వస్తే కౌలు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోని బైబిల్, భగవద్గీతతో సమానమని చెప్పే కేసీఆర్.. అందులో ఉన్న రూ.1 లక్ష రుణమాఫీని ఎందుకు అమలు చేయలేదని అడిగారు. నిరుద్యోగ భృతి కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదన్నారు. TSPSC పేపర్ లికేజీలో ప్రభుత్వ పెద్దల అండ దండ ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తెలంగాణలో చదువుకుంటే ఉద్యోగం రాదని, పైరవీలు చేస్తేనే ఉద్యోగం వస్తుందని వ్యాఖ్యానించారు.
Poonam Pandey: బీచ్ ఒడ్డున బికినీలో శృంగార తార.. శృంగార భంగిమలు..
తెలంగాణలో గల్లీ గల్లీలో బెల్టు షాపులు ఉన్నాయని.. తాను ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు మద్యం ద్వారా రూ.10,700 కోట్లు ఆదాయం వచ్చేదని.. ఇప్పుడు రూ.45 వేల కోట్లు వస్తున్నాయని ఈటల వివరించారు. ఆరోజు మున్సిపల్ కార్మికుల్ని ఎందుకు తీసేశావ్? ధర్నా చౌక్ ఎందుకు ఎత్తేశావ్? అని ప్రశ్నించానని.. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు 39 మంది చనిపోగా, వాళ్ల ఉసురు పోసుకోకని చెప్పానని.. దాంతో కోపం వచ్చి తనని బర్తరఫ్ చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాసం ఉండి, అటుకులు బుక్కిన కేసీఆర్‌కి.. హుజురాబాద్‌లో తనని ఓడించేందుకు రూ.600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ని ఓడించడానికి తమ వద్ద డబ్బులు గానీ, మద్యం సీసాలు గానీ లేవని.. కానీ ఆత్మగౌరవం కలిగిన బిడ్డల ఆశీర్వాదంతో తప్పకుండా కేసీఆర్‌ని ఓడిస్తామని చెప్పుకొచ్చారు.