KCR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో మహబూబ్ నగర్ (పాలమూరు) జిల్లా తీవ్ర వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. జిల్లా సాగునీటి కష్టాలు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 100 శాతం కృష్ణా బేసిన్‌లో ఉన్నప్పటికీ, జిల్లా ప్రజలు తాగునీరు, సాగునీటి కోసం అలమటించారని, పొట్టచేత పట్టుకుని బొంబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్లడం తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. బచావత్ ట్రిబ్యునల్ గుర్తించినా.. పాలకుల నిర్లక్ష్యం…
CM Revanth Reddy Emotional Speech at Osmania University: ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి.. ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలి అని అనుకున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చినది ఉస్మానియా యూనివర్సిటీ అని కొనియాడారు. యూనివర్సిటీకి వచ్చే ముందుకు సీఎం మీరు చాలా ధైర్యం చేస్తున్నారు అన్నారు.. సీఎంని అడ్డుకునే చరిత్ర ఉంది.. మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని చెప్పారన్నారు. నాది దైర్యం కాదు... నాది అభిమానం…
చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కవిత మాట్లాడుతూ.. “చింతమడక గ్రామం చరిత్ర సృష్టించిన ప్రదేశం.
ఇవాళ ఎవరు కొత్త పార్టీ పెట్టినా నమ్మే పరిస్థితి లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీలో కలుపుతున్నారన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు విలీనం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేయొచ్చన్నారు.. బీజేపీ నుంచి ఎవరూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను కలుస్తానని కవిత అంటోందని.. కవిత కలిసి ఏం చేస్తదని విమర్శించారు. అందులో కొందరు చనిపోయారని.. కొందరు ఇంకెక్కడో ఉన్నారో తెలియదు, మరి కొందరు పార్టీలు…
అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా ఇచ్చారు. కిష్టయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థిక సాయం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నట్లు కేసీఆర్ పత్రికా ప్రకటనలో తెలిపారు.
Gutha Sukender Reddy : పెహల్గం ఘటన తర్వాత దేశ ప్రజల అభిప్రాయం మేరకు కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. యుద్ధం కంటే ఉగ్రవాద నిర్మూలన చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. Gold Rates:…
MLC Vijayashanti : తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె బీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై, అలాగే బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీని బలవంతంగా విలీనం చేశారని ఆమె ఆరోపించారు. విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్ కంటే ముందే క్రియాశీలంగా పాల్గొన్నానని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌కు సొంతం కాదని స్పష్టం చేశారు. “నా పార్టీని బలవంతంగా విలీనం చేశారు. తెలంగాణ కోసం…
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి చరిత్రలో ఏ రోజు జై తెలంగాణ అనలేదు…ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చిందంటే కారణం కేసీఆర్ అని, కానీ ఎవరో దయతో వచ్చిందని సీఎం చెబుతుంటే ఇది తెలంగాణ ఉద్యమం, అమరులను అవమాన పరచడమే అని ఆయన మండిపడ్డారు. తెలంగాణకి నంబర్ వన్…
దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కేసీఆర్ తన దీక్షతో తెలంగాణ ప్రకటనకు శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడ్చల్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఉన్నంత వరకు రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని గుర్తిస్తారన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని తెలంగాణపై దాడి చేస్తున్నారని.. కేసీఆర్‌ను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నంలో అస్తిత్వం మీద దాడి జరుగుతోందని విమర్శించారు.
ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులు జయ జయహే తెలంగాణ గీతాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. గత పదేళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైందన్నారు. ఈ పండుగ రోజు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.