Balka Suman: కాంగ్రెస్‌కు ఓటేస్తే చంద్రబాబుకి వేసినట్టే.. బాల్క సుమన్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balka Suman Fires On Revanth Reddy Congress Party: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు పక్కనున్న దొంగ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే, చంద్రబాబుకి ఓటు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో పోడు భూములు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే, రూ.4 వేల పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ మాయమాటలు చెప్తోందని, దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసులు, గిరిజనలు తమ హక్కులు అడిగితే.. గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్‌ది అని విమర్శించారు.
Rape And Kidnap: మహిళపై అత్యాచారం.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేసిన తాంత్రికుడు..!
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
50 ఏళ్ళు పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. పోడు పట్టాలు ఎందుకు ఇవ్వలేదని బాల్క సుమన్ ప్రశ్నించారు. గిరిజనులకు కేసీఆర్ సర్కార్ చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక.. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. 50 ఏళ్లలో విపక్ష నాయకులు ఆస్తులు, అంతస్తులు పెంచుకున్నారే గానీ.. ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. విపక్షాల దొంగ ప్రేమ, కపట ప్రేమను నమ్మొద్దని ప్రజల్ని సూచించారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే.. అక్కడ కేసీఆర్ సార్, ఇక్కడ బాల్క సుమన్ గెలుపొందాలని అన్నారు. కరోనా సమయంలో మోడీ సర్కార్ సహకరించకపోయినా.. కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. కల్లోలితో తెలంగాణ కాదు, బంగారు తెలంగాణ కావాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన.. గిరిజన సంక్షేమానికి ఒక స్వర్ణయుగమని అభివర్ణించారు.
Ponguleti Srinivas Reddy: 100 సీట్లతో గెలుస్తాం.. బీఆర్ఎస్‌ని ఓడిస్తాం
దశాబ్దాలుగా అడవి తల్లిబిడ్డలు గుట్టలను చదును చేసి, పోడు భూములను సాగు భూములుగా మలుచుకున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా హక్కులు దక్కలేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ వారి గోడు విని, రాష్ట్రవ్యాప్తంగా 1,51,146 మంది పోడు రైతులకు పట్టాలు అందజేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. 128 జిల్లాల పరిధిలో 1,51,148 మంది లబ్దిదారులు పోడు పట్టాలు పొందేందుకు అర్హులని ప్రభుత్వం గుర్తించిందని, వారందరికీ ఈ వానాకాలం సీజన్ నుండే రైతుబంధును అందించనున్నదని పేర్కొన్నారు. గిరిజనుల అస్తిత్వాన్ని గుర్తించి, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. గిరిజనులపై ప్రేమను, చిత్తశుద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం చాటుకుందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..